నేటి కాలంలో ఏ రంగంలోనైనా నెగ్గుకురావాలంటే టెక్నాలజీపై పట్టు ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో.. మన యువతకు ఆ రంగంలో నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (IICT) భాగస్వామ్యంతో గూగుల్, యూట్యూబ్‌లతో చేతులు కలిపింది. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ఏకంగా 15,000 మందికి స్కాలర్ షిప్ (scholarship) అందజేయనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రోగ్రామ్ ఎవరి కోసం?
ముఖ్యంగా మీడియా, ఎంటర్టైన్మెంట్, యానిమేషన్, గేమింగ్ , డిజిటల్ స్టోరీ టెల్లింగ్ రంగాల్లో రాణించాలనుకునే విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌కు ఇది ఒక అద్భుతమైన అవకాశం. క్రియేటివ్ ఫీల్డ్‌లో AI సాధనాలను (AI Tools) ఎలా వాడాలి, వాటితో కొత్త రకమైన కంటెంట్‌ను ఎలా సృష్టించాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్పిస్తారు.
శిక్షణ ఎలా ఉంటుంది? (రెండు దశల్లో..)
ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తోంది..
- మొదటి దశ: ఎంపికైన విద్యార్థులందరికీ AI ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇస్తారు. గూగుల్ కెరీర్ సర్టిఫికెట్స్, గూగుల్ క్లౌడ్ ద్వారా AI బేసిక్స్, సురక్షితమైన వినియోగం గురించి అవగాహన కల్పిస్తారు.
- రెండవ దశ: మొదటి దశ పూర్తి చేసిన వారికి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో నేరుగా ప్రాజెక్టులు చేయడం, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ ఎలా వైరల్ చేయాలి? గూగుల్ AI టూల్స్ వాడకం వంటి అంశాలపై 'హైబ్రిడ్ మోడ్'లో శిక్షణ ఇస్తారు.
ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి!
కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం 'ఆరెంజ్ ఎకానమీ' (గేమింగ్, డిజిటల్ కంటెంట్, AVGC) కి పెద్దపీట వేసింది. ఈ రంగాల్లో భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. అందుకే విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్కాలర్ షిప్ (scholarship) ద్వారా లభించే సర్టిఫికేట్, నైపుణ్యం విద్యార్థులు నేరుగా ప్రొఫెషనల్ రంగంలో సెటిల్ అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
అప్లై చేసుకోవడం ఎలా?
IICT ముంబై ఈ ప్రోగ్రామ్ అమలును పర్యవేక్షిస్తోంది. గూగుల్ , యూట్యూబ్ సహకారంతో రూపొందించిన ఈ సిలబస్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వాడుకుంటే, భవిష్యత్తులో మంచి కెరీర్ నిర్మించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రారంభించిన 'క్రియేట్ విత్ AI' (Create with AI) చొరవకు ఇది ఒక పెద్ద వెర్షన్ అని చెప్పవచ్చు.
సాధారణంగా ఇలాంటి కోర్సులకు బయట వేల రూపాయలు ఖర్చవుతాయి. కానీ ప్రభుత్వం గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో కలిసి ఉచితంగా ఈ స్కాలర్ షిప్ (scholarship) , ట్రైనింగ్ ఇస్తుండటం నిజంగా గొప్ప విషయం. డిజిటల్ యుగంలో ముందంజలో ఉండాలనుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్!
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications