క్రిప్టో కరెన్సీలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు వాటిని వస్తువు లేదా సేవగా వర్గీకరించాలి. ఈ వర్గీకరణ పూర్తయితే క్రిప్టోకు సంబంధించి జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ పైన జీఎస్టీని విధించవచ్చు. ప్రస్తుతం క్రిప్టో ఎక్స్చేంజీలు అందించే సేవలను ఆర్థిక సేవలుగా పరిగణిస్తూ 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. క్రిప్టోలు కూడా లాటరీ, జూదం, గుర్రపు పందల వంటివి. కాబట్టి 28 శాతం జీఎస్టీ విధించడం మంచిదని అంటున్నారు. వర్గీకరణ స్పష్టమైతే ఎంత జీఎస్టీని విధించాలో నిర్ణయించవచ్చునని అంటున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అంటే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి క్రిప్టోల ట్రాన్సాక్షన్స్ లాభాలు ముప్పై శాతం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. బంగారం విషయంలో మాత్రం ట్రాన్సాక్షన్ వ్యాల్యూపై 3 శాతం వద్ద జీఎస్టీ విధిస్తారు.

క్రిప్టో కరెన్సీ మొత్తం ట్రాన్సాక్షన్స్ పైన జీఎస్టీ విధిస్తే అప్పుడు రేటు 0.1 శాతం నుండి 1 శాతం పరిధిలో ఉంటుందని మరో జీఎస్టీ అధికారి చెబుతున్నారు. అయితే ముందుగా వర్గీకరణ నిర్ణయం ఖరారయ్యాక ఆపై రేటును చర్చించనున్నారు. క్రిప్టో కరెన్సీ వర్గీకరణను జీఎస్టీ స్పష్టంగా చేయలేదు. అసలు యాక్షనబుల్ క్లెయింగా దీనిని పరిగణించవచ్చా లేదా అని చూడాలని అంటున్నారు. క్రిప్టోల నియంత్రణలపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టం లేకపోవడంతో దీనిని యాక్షనబుల్ క్లెయింగా పరిగణించాలా లేదా అనే దానిపై సందేహాలు ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications