EV: ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా వినియోగంలోనికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సబ్సిడీని సైతం అందించింది. ఉద్యోగులకు ట్యాక్స్ బెనిఫిట్ నూ ఇచ్చింది. అయితే ప్రస్తుతం సబ్సిడీని తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయంతో.. EV ద్విచక్రవాహనాలను కొనాలనుకునే వారి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.
ద్విచక్ర వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం FAME II పేరిట ఇస్తున్న సబ్సిడీ పథకాన్ని సవరించింది. తాజా స్కీమ్ జూన్ 1 నుంచి అమలవుతోంది. తయారీదారులు కాంపోనెంట్ లోకలైజేషన్ నిబంధనలకు కట్టుబడి ఉండటం లేదని మోడీ సర్కారు గుర్తించింది. 12 మంది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల ద్వారా నకిలీ స్థానికీకరణ మరియు తప్పు సబ్సిడీ క్లెయిమ్‌లు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 10 వేల కోట్ల FAME II పథకం అమలుపై విచారణ ప్రారంభించబడింది.

స్థానిక సరఫరా గొలుసు అభివృద్ధి వేగంగా జరిగేలా వాహన ధరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. "FAME సబ్సిడీని తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నాము. ఇది దీర్ఘకాలంలో పరిశ్రమను బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాము. 40 శాతం సబ్సిడీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ చర్య ఆవిష్కరణ మరియు ప్రపంచ వ్యయ పోటీతత్వాన్ని ప్రోత్సహించదు" అని భారత్ న్యూ-ఎనర్జీ CEO అనిరుధ్ రవి నారాయణన్ తెలిపారు.
ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్ II నుండి GEMPLని డి-రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. క్లెయిమ్ చేసిన అన్ని ప్రోత్సాహకాల మొత్తం వడ్డీతో సహా సుమారు 124 కోట్లను.. ఈ పథకం కింద డిపాజిట్ చేయాలని AGEMPLని భారీ పరిశ్రమల శాఖ ఆదేశించింది. సబ్సిడీ డెడ్‌లాక్‌ను త్వరగా పరిష్కరించేందుకు సంబందింత శాఖ నుంచి అధికారిక కమ్యూనికేషన్ కోసం తాము ఎదురుచూస్తున్నామని హీరో ఎలక్ట్రిక్ ఇటీవల తెలిపింది.s


Click it and Unblock the Notifications