రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేరుతో ఒక ఫేక్ వాయిస్ కాల్ ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. మీ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ చేసే విధమైన ఆక్టివిటీ కారణంగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నట్లు ఈ వాయిస్ కాల్ హెచ్చరిస్తుంది. అయితే, PIB ఫాక్ట్ చెక్ ఈ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని, వాటిని నమ్మవద్దని వెల్లడించింది.
PIB ఫాక్ట్ చెక్ X (గతంలో Twitter) పోస్ట్‌లో ఇది ఫేక్ వాయిస్ కాల్ అని తేల్చి చెప్పింది. ఇంకా క్రెడిట్ కార్డు కస్టమర్లను అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ ఫేక్ వాయిస్ కాల్లో మీ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ ఆక్టివిటీలో పాల్గొన్న కారణంగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నట్లు చెబుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి మీకు వాయిస్ మెయిల్ వచ్చిందా #PIBFactCheck అలెర్ట్! ఇదొక స్కామ్ అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ Xద్వారా తెలిపింది.

ఫేక్ వాయిస్ కాల్ ఏంటి
మొదట మీ పేరు మీద ఉన్న అన్ని బ్యాంకు అకౌంట్స్ రెండు గంటల్లో బ్లాక్ అవుతాయి, దయచేసి 9 నొక్కండి అంటూ చెబుతుంది. తరువాత హలొ నమస్తే భారతీ రిజర్వ్ బ్యాంక్ మీ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ ఆక్టివిటీ చర్యలో పాల్గొన్నట్లు గుర్తించింది. ఈ కారణంగా మీ క్రెడిట్ కార్డు బ్లాక్ చేస్తున్నం అని చెబుతారు, తర్వాత స్కామర్ మీతో కనెక్ట్ అయి మిమ్మల్ని స్కామ్ చేస్తారు.
ఫేక్ వాయిస్ కాల్స్ నుండి సేఫ్ గా ఉండటం ఎలా
*ఊహించని కాల్స్ వస్తే అనుమానించండి
*మీకు తెలియని నంబర్ లేదా ఊహించని కాల్ వస్తే జాగ్రత్తగా ఉండండి.
*చట్టబద్ధమైన సంస్థలు చాలా అరుదుగా మీ సమాచారం కోసం కాల్స్ చేస్తాయి.
* కలర్ ఐడెంటిటీ గుర్తించండి
*మీకు బ్యాంక్, ప్రభుత్వ ఏజెన్సీ లేదా కంపెనీకి నుండి అని కాల్ చేస్తే వారి గుర్తింపును అడగండి, కన్ఫర్మ్ చేసుకోండి.
*అఫీషియల్ వెబ్‌సైట్‌లో కనిపించే కాంటాక్ట్ సమాచారాన్ని (ఫోన్ నంబర్స్, ఇమెయిల్ అడ్రస్) మాత్రమే నమ్మండి.
*పర్సనల్ సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేసుకోవద్దు.
*మీ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారం, పాస్‌వర్డ్‌లు లేదా ఏదైనా ఇతర పర్సనల్ సమాచారాన్ని తెలియని వారితో షేర్ చేయవద్దు.
*తొందర పెట్టి నిర్ణయం తీసుకునేలా మిమ్మల్ని ఒత్తిడి చేస్తే కాస్త టైం తీసుకోండి ఖంగారు పడకుండా ఆలోచించండి, తొందర పెట్టనివ్వవద్దు.
*ఫేక్ కాల్స్ అని మీరు గుర్తిస్తే వెంటనే కాల్ కట్ చేసి ReportFraud.ftc.govలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి లేదా మీరు మీ టెలికాం ఆపరేటర్ కి కూడా కాల్ చేసి రిపోర్ట్ చేయవచ్చు.
*చాలా ఫోన్స్ ఇంకా టెలికాం ఆపరేటర్లు కాల్-బ్లాకింగ్ ఫీచర్స్ అందిస్తున్నాయి. స్పామ్ నంబర్స్, ఫేక్ కాల్స్ బ్లాక్ చేయడానికి ఈ ఫీచర్స్ ఉపయోగించవచ్చు
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications