Credit Ratings: ప్రపంచమంతా ఆర్థిక అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఇండియా ఓ బ్రైట్ స్పాట్ అంటూ పలు అంతర్జాతీయ సంస్థలు కొనియాడాయి. అయితే ఆ పొగడ్తల వెనుక పలు కారణాలు ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ ఇటీవల పలు రేటింగ్ సంస్థలు భారత్ పై తమ దృక్పథాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రేటింగ్ పెంపు కోసం భారత అధికారులు మూడీస్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతర్జాతీయ విపణిలో ఇండియాకు మంచి ఇమేజ్ ఉంది. కానీ దానిని ఉపయోగించి క్రెడిట్ రేటింగ్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ఏజెన్సీలను మాత్రం ఒప్పించలేకపోయింది. భారత బలాలను గుర్తించినప్పటికీ ఇండియాకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ Baa3 రేటింగ్‌ను ఇచ్చింది. ఫిచ్ మరియు S&P సైతం అదే బాటలో BBB- రేటింగ్‌ను నిర్ణయించాయి. ఇది అత్యల్ప పెట్టుబడి గ్రేడ్‌ను సూచిస్తుంది.

మూడీస్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసినప్పుడు భారత ప్రభుత్వ అధికారులు మరియు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్.. రేటింగ్ అప్‌గ్రేడ్ కోసం విజ్ఞప్తి చేసినట్లు ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. ఈ విషయంలో ఏజెన్సీని ఒప్పించేందుకు బడ్జెట్, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, రుణాలను కీలక అంశాలుగా ప్రస్తావించారట. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఇండియా కంటే ఎక్కువగా రేట్ చేయబడటంతో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నారని పేర్కొంది.
FY23లో ఆర్థిక వృద్ధి 7.2 శాతానికి చేరుకోవడం, గత నెల అంచనాలు 6.1 శాతాన్ని మించడంతో మూడీస్ తన నిర్ణయం మార్చుకుంటుందని ఆశిస్తున్నారు. అయితే మూడీస్ ఉపయోగించిన గణాకాలను ప్రశ్నించడం, ఇండియాని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చిచూడటం వంటిని చేయలేదని తెలుస్తోంది. నగదు ప్రవాహాన్ని పెంచడానికి క్రెడిట్ రేటింగ్స్ ముఖ్యమని ప్రధాన ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు. ఏజెన్సీలు అప్‌గ్రేడ్ చేయడం వల్ల వడ్డీ రేట్లు కూడా 100 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications