For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాదాపూరే కావడంతో సమస్యలు! హైదరాబాద్ నగరం చుట్టూ ఏడు ఐటీ క్లస్టర్లు

|

హైదరాబాద్: తెలంగాణలో సాఫ్టువేర్, దాని ఆధారిత పరిశ్రమలను విస్తరించి ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేయనుందట. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో... హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధి అంటే ఎక్కువగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే ఈ ప్రాంతాల్లోనే కాకుండా భాగ్యనగరం మొత్తం ఐటీ విస్తరించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించనుంది.

భాగ్యనగరంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించే ఓ విధానాన్ని రూపకల్పన చేస్తోందట. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి వ్యాప్తిగా దీనిని తీసుకు వస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి పదేళ్ల కాలపరిమితితో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకు రానుందట.

ఇవాంకా, ఎలిజబెత్ కంటే నిర్మలా సీతారామన్ పవర్‌ఫుల్ఇవాంకా, ఎలిజబెత్ కంటే నిర్మలా సీతారామన్ పవర్‌ఫుల్

Government to set up seven electronic clusters in Hyderabad

ఇప్పటికే మాదాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్, స్థలాలు సహా వివిధ సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు నగరం చుట్టూ ఏడు క్లస్టర్లను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోందట. అయితే పాత క్లస్టర్ల విస్తరణతో పాటు కొత్తవాటిని అభివృద్ధి చేయనున్నారు.

English summary

మాదాపూరే కావడంతో సమస్యలు! హైదరాబాద్ నగరం చుట్టూ ఏడు ఐటీ క్లస్టర్లు | Government to set up seven electronic clusters in Hyderabad

Government to set up seven electronic clusters in Hyderabad. Goverment is planning IT development in Hyderabad behind Madhapur area.
Story first published: Sunday, December 15, 2019, 8:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X