ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన విషయం తెలిసిందే. జీఎస్టీ కలెకన్షన్లు గత ఏడాదిలో తగ్గిపోయాయి. ఆదాయపు పన్ను ద్వారా వచ్చే రెవెన్యూ కూడా ఈసారి తగ్గనుంది. ఆదాయం తగ్గడంతో రాష్ట్రాలకు ఇచ్చే ఫండ్స్ విడుదలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జీఎస్టీ బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బకాయిలు రావాల్సి ఉందని ఏపీ కూడా చెప్పింది. రాష్ట్రాలకు ఇప్పుడు శుభవార్త వచ్చింది.

రూ.35,000 కోట్లు విడుదల చేస్తాం
కేంద్రం త్వరలో రాష్ట్రాలకు రూ.35,000 కోట్లను విడుదల చేయనుంది. త్వరలో కన్సాలిడేటెడ్ ఫండ్ (CFI) నుండి రూ.35వేల కోట్ల మొత్తాన్ని రెండు వాయిదాల్లో విడుదల చేస్తామని, అక్టోబర్ - నవంబర్ పరిహారాన్ని మొదట విడుదల చేస్తామని అధికారులు వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

రెండు వాయిదాల్లో విడుదల
2017 జూలై 1 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ చట్టం ప్రకారం అయిదేళ్ల పాటు జీఎస్టీ పరిహారం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నెల వారీ పరిహారాన్ని రెండు నెలల్లోపు చెల్లించాలి. కానీ సెప్టెంబర్ 2019 తర్వాత నుండి రాష్ట్రాలకు పరిహారం అందలేదు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను రెండు వాయిదాల్లో చెల్లిస్తామని బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు.

సెప్టెంబర్ వరకు విడుదల
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం FY20లో రాష్ట్రాలకు జీఎస్టీ ఫండ్ షార్ట్‌ఫాల్ రూ.15వేల కోట్ల నుంచి రూ.25వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు పరిహారాన్ని ఇప్పటికే చెల్లించింది. డిసెంబర్ 2019లో చివరిసారి రాష్ట్రాలకు రూ.35,298 కోట్లు జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications