కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోని మరో 11 కీలక విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధమైంది. దీని ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 6,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం విమాన ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏయే విమానాశ్రయాలు ఈ జాబితాలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఒకటి లాభం.. ఒకటి నష్టం! కొత్తగా 'బండ్లింగ్' విధానం
ఈసారి ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనినే 'బండ్లింగ్' విధానం అంటున్నారు. అంటే ఎక్కువ లాభాలు వచ్చే పెద్ద ఎయిర్‌పోర్ట్ తో పాటు, తక్కువ ఆదాయం వచ్చే చిన్న ఎయిర్‌పోర్ట్ ను కలిపి ఒకే ప్యాకేజీగా విక్రయిస్తారు. దీనివల్ల చిన్న విమానాశ్రయాల్లో కూడా మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న 5 ప్యాకేజీలు ఇవే..
ప్రస్తుతానికి ప్రభుత్వం మొదటి దశగా.. ఒక ఐదు ఎయిర్ పోర్ట్ ప్యాకేజీలను రెడీ చేసింది. అవేంటంటే..
- వారణాసి - కుషీనగర్ - గయా
- అమృత్‌సర్ - కాంగ్రా
- భువనేశ్వర్ - హుబ్లీ
- రాయ్‌పూర్ - ఔరంగాబాద్
- తిరుచిరాపల్లి - తిరుపతి
మన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయం కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
రంగంలోకి దిగ్గజ సంస్థలు
ఈ విమానాశ్రయాలను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్, జీఎంఆర్ (GMR) ఎయిర్ పోర్ట్స్ వంటి స్వదేశీ సంస్థలతో పాటు విన్సీ ఎయిర్ పోర్ట్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కో ప్రయాణికుడిపై ఏ సంస్థ అయితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం (Revenue share) ఇస్తామని ఆఫర్ చేస్తుందో.. ఆ సంస్థకే కాంట్రాక్ట్ దక్కుతుంది. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ నాటికి పూర్తి కానుంది.
విమానాశ్రయాల ప్రైవేటీకరణలో కొత్త మలుపు
ప్రభుత్వం అమలు చేస్తున్న 'బండ్లింగ్' పద్ధతి ద్వారా చాలా లాభాలే ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఇచ్చే లాభదాయకమైన విమానాశ్రయాలను, తక్కువ ఆదాయం వచ్చే చిన్న విమానాశ్రయాలతో కలిపి గ్రూపులుగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల ద్వారా వచ్చే లాభాలను చిన్న ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధికి (క్రాస్-సబ్సిడీ) ఉపయోగించవచ్చు. తద్వారా ఒంటరిగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించలేని చిన్న నగరాల విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనిపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) సమీక్ష చేస్తోంది. రెవెన్యూ షేరింగ్ ఎలా ఉండాలి, ప్రయాణికులపై యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు ఎంత విధించాలి? అలాగే ఒకే కంపెనీకి ఎన్ని ఎయిర్‌పోర్ట్‌లు ఇవ్వాలి? అనే అంశాలపై వారు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయాణికుల టికెట్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారతదేశంలో ఈ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రయాణం 2003లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లతో మొదలైంది. 2006లో ఢిల్లీని జీఎంఆర్ (GMR), ముంబైని జీవీకే (GVK) దక్కించుకోగా 2021లో ముంబై ఎయిర్‌పోర్ట్ అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక రెండో విడతలో 2020-21 మధ్య కాలంలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గువహటి మరియు తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రభుత్వం లీజుకు ఇచ్చింది.
మొత్తానికి విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేట్ చేతుల్లో పెట్టడం ద్వారా కొత్త టెక్నాలజీని, మెరుగైన సౌకర్యాలను ప్రయాణికులకు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే ఇది భవిష్యత్తులో విమాన ఛార్జీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్‌పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications