ప్యాకేజీపై మోడీ గోల్‌మాల్: కేంద్రం ఇచ్చేది రూ.3 లక్షల కోట్లే, మిగతా అంతా...

కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల (జీడీపీలో 10 శాతం) ప్యాకేజీపై ప్రకటన చేయగా, ఐదు రోజులపాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏ రంగానికి ఎంత ఉద్దీపన ఇస్తున్నారో వివరించారు. మొత్తం దాదాపు రూ.21 లక్షల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. మొదటి రోజు రూ.5,94,550 కోట్లు, రెండో రోజు రూ.3,10,000 కోట్లు, మూడో రోజు రూ.1,50,000 కోట్లు, మూడు, నాలుగో రోజు కలిపి రూ.48,100 కోట్లు ప్రకటించారు. అంతకుముందు గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.1,92,800 కోట్లు, ఆర్బీఐ ప్రకటన రూ.8,01,603 కోట్లు. మొత్తం రూ.20,97,053 కోట్లు. అయితే దీనిపై ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు పెదవి విరిచాయి.

ఇచ్చింది రూ.2.02 లక్షల కోట్లే

ఇచ్చింది రూ.2.02 లక్షల కోట్లే

ఈ ప్యాకేజీలో బడ్జెట్ ఖర్చు రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) ఓ నివేదికలో తెలిపింది. మొత్తం ప్యాకేజీలో ఇది 10 శాతం కూడా కాదని పేర్కొంది. ప్రభుత్వంకొండంత ఇస్తామని చెప్పి తక్కువగా ఇచ్చిందని అబిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ప్రకటించిన నిధుల చలామణి పెంపు చర్యల ద్వారానే రూ.8.01 లక్షల కోట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో కేవలం 10 శాతం మాత్రమే కేంద్రంపై భారం మోపుతుందని, మిగతా నిధులు ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య చలామణి పెంపు చర్యలు, ప్రభుత్వ రుణ హామీ పథకం, బీమా పథకాల ద్వారా సమకూరుతాయని EY ఇండియా డీకే శ్రీవాత్సవ అన్నారు.

బడ్జెట్‌పై ప్రభావం రూ.1.50 లక్షల కోట్లే

బడ్జెట్‌పై ప్రభావం రూ.1.50 లక్షల కోట్లే

ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ బడ్జెట్ పైన ప్రభావం మాత్రం కేవలం రూ.1.50 లక్షల కోట్లు మాత్రమేనని బార్క్‌లేస్ దేశీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా అన్నారు. ఇది జీడీపీలో ఇది 0.5 శాతం మాత్రమేనని తెలిపారు. కరోనా సాయం కంటే ద్రవ్యలోటు కట్టడికే మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్యాకేజీ రూ.3.22 లక్షల కోట్లు మాత్రమే..

ప్యాకేజీ రూ.3.22 లక్షల కోట్లు మాత్రమే..

కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని విపక్షాలు విమర్శించాయి. రూ.20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్ మండిపడింది. మోడీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ దాదాపు 10 శాతం కాదని, కేవలం 1.6 శాతం మాత్రమేనని కాంగ్రెస్ చెబుతోంది. ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి పేదలు, ఎంఎస్ఎంఈలకు నగదును అందించేందుకు ప్రధాని మోడీ మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు.

85 శాతం అవే భరిస్తున్నాయి

85 శాతం అవే భరిస్తున్నాయి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదు రోజుల్లో రూ.20,97,053 కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారని, ఇందులో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలకు రూ.9,94,903 కోట్లు ఆర్బీఐ ద్రవ్యాన్ని సమకూరుస్తుందని చెప్పారని, రుణ ఆధారిత పథకాలు, కొత్త పథకాల విలువ రూ.9,74,548 కోట్లుగా చెప్పారని, రూ.3,20,902 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి నిజమైన ఖర్చు అని టీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కేంద్రం ప్రకటించిన మొత్తం ప్యాకేజీలో 15 శాతం మాత్రమేనని, మిగతా 85 శాతం ప్యాకేజీని ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకులు, నాబార్డు భరిస్తున్నాయన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అమెరికా, యూరోపియన్ యూనియన్ కంటే తక్కువ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+