భారీగా పెరిగిన వంట నూనె ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అందుకే కరోనా సెకండ్ వేవ్ సమయంలో రూ.180కి పైగా ఉన్న ధరలు ఇప్పుడు రూ.150 దిగువకు వచ్చాయి. ఇప్పుడు మరి కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రిఫైన్డ్ పామ్ ఆయిల్ పైన దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించింది. దేశీయ సరఫరాను, వినియోగాన్ని పెంచడానికి వచ్చే మార్చి నెల వరకు రిఫైన్డ్ పామ్ ఆయిల్ బేసిక్ కస్టమ్ డ్యూటీని 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది. ధరలు తగ్గిన నేపథ్యంలో త్వరలో రిటైల్ ధరలు కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధరలు కాస్త తగ్గింపు
బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD) తగ్గింపుతో రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్ట్ పామోలిన్ 19.25 శాతం నుండి 13.75శాతానికి తగ్గుతుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(SEA) తెలిపింది. సోమవారం సాయంత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. రిఫైన్డ్ పామ్ ఆయిల్ పైన BCD తగ్గించామని, మార్చి 31, 2022 వరకు 17.5 శాతం నుండి 12.5 శాతానికి తగ్గినట్లు తెలిపింది.

డేటా ప్రకారం ధరలు ఇలా
కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం సగటు ధరలు సోమవారం కింది విధంగా ఉన్నాయి. పల్లి నూనె ధర రూ.181గా, మస్టర్డ్ ఆయిల్ ధర రూ.187గా, నవస్పతి నూనె రూ.138, సోయాబీన్ ఆయిల్ రూ.150, సన్‌ఫ్లవర్ రూ.163గా, పామ్ ఆయిల్ రూ.130గా ఉంది.
ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపుపై SEA ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది మాట్లాడుతూ.. పామోలిన్ పైన దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో కొనుగోలుదారులకు కూడా కాస్త భారం తగ్గుతుందన్నారు.

భారీగా దిగుమతి
భారత్ 65 శాతం ఎడిబుల్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగం 22 మిలియన్ టన్నులకు పైగా ఉండగా, 13 మిలియన్ టన్నుల నుండి 15 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరోనా కారణంగా గత ఏడాది నవంబర్ నుండి ఈ ఏడాది అక్టోబర్ వరకు 13 మిలియన్ టన్నులకు పడిపోయింది. 2019-20లో దిగుమతులు రూ.71,600 విలువ కలిగిన 13.2 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోగా, 2020-21లో రూ.1.17 లక్షల కోట్ల విలువ కలిగిన దిగుమతులు నమోదు చేసింది. దేశీయ నూనెల వినియోగంలో ఇది 63 శాతం.

పప్పు దినుసులు..
కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుల దిగుమతులను 2022 మార్చి 31 వరకు స్వేచ్ఛా విభాగం కింద చేసుకునేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఇప్పటి వరకు ఈ గడువు 2021 డిసెంబర్ 31 వరకు ఉంది. ఈ దిగుమతులను పరిమితుల నుండి స్వేచ్ఛా విభాగంలోకి మార్చడంతో దేశీయంగా పప్పుదినుసుల సరఫరా పెరిగి, ధరలు అదుపులో ఉంటాయన్నది ప్రభుత్వ అంచనా. డిమాండ్‌కు తగినట్లు దేశీయంగా దిగుబడి లేనందున భారత్ పప్పు ధాన్యాలను కొంతమేర దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పప్పు దినుసుల వినియోగం 26 మిలియన్ టన్నులు. 9.5 మిలియన్ టన్నులు పండుతుందని అంచనా.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications