ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన రిఫైనరీ ఆస్తుల్లోని 20 శాతం వాటాను సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోకు విక్రయించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సౌదీ ఆరామ్‌కో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ. దీనికి భారత ప్రభుత్వం షాకిచ్చినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరి 6న విచారణ...
రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ గ్యాస్ (BP)పై కొనసాగుతున్న కోర్టు కేసులో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ కంపెనీ ఆస్తులను వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రిలయన్స్ డైరెక్టర్లను ప్రభుత్వం కోరింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6వ తేదీన విచారణ చేపట్టనుందని అంటున్నారు.

ఆరామ్‌కోకు విక్రయం.. నిలుపుదల చేసిందా?
గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్ వ్యాపారంలో మైనార్టీ (20 శాతం) వాటా కోసం సౌదీ ఆరామ్‌కో కంపెనీ 1,000 నుంచి 1,500 కోట్ల డాలర్ల పెట్టుడులు పెట్టనుందని వార్తలు వచ్చాయి. దీనిపై రిలయన్స్ స్పందించాల్సి ఉంది. రిలయన్స్, బీపీలు తమ ఆస్తులు విక్రయించకుండా ప్రభుత్వం ప్రస్తుతానికి నిలుపుదల చేసిందని చెబుతున్నారు.

డెబిట్స్
రిలయన్స్ రూ.2.88 ట్రిలియన్ల (40.5 బిలియన్ డాలర్లు) భారీ డెబిట్‌లో ఉందని, ప్రభుత్వం కూడా అఫిడవిట్లో పేర్కొందట. ఇలాంటి పరిస్థితుల్లో వాటాల విక్రయం సరికాదని అభిప్రాయపడింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications