నేడు మన రోజువారీ జీవితంలో డబ్బులు పంపడం, చెల్లింపులు చేయడం అంత సులభం కావడానికి కారణం UPI. ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. అయితే, "ఇకపై UPIకి ఛార్జీలు పెడతారట" అన్న రూమర్లు చాలా మందిని ఆందోళనకు గురి చేశాయి. దీనిపై ప్రభుత్వం నిశ్చయంగా చెప్పింది. "UPI లావాదేవీలపై ఎప్పటికీ ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది ఎల్లప్పుడూ ప్రజలకు, వ్యాపారులకు ఉచితంగా, సురక్షితంగా అందుబాటులో ఉంటుంది" అని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో "UPIపై త్వరలో ఛార్జీలు పెట్టబోతున్నారు" అన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ పుకార్లకు సమాధానం అని చెప్పొచ్చు.
UPI లావాదేవీలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో నడుస్తాయి.
2019లో బ్యాంకులు వ్యాపారుల దగ్గర నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయడానికి అనుమతి ఇచ్చినా, తర్వాత చట్టపరంగా ఎటువంటి ఫీజు వేయరాదు అన్న నిబంధన వచ్చింది. అందువల్ల UPI, RuPay లావాదేవీలన్నీ పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి.
UPI వాడకాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం 2021-22 నుంచి ప్రత్యేక ప్రోత్సాహక పథకం అమలు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపు రూ. 8,730 కోట్లు డిజిటల్ చెల్లింపుల భాగస్వాములకు సబ్సిడీగా ఇచ్చింది.
దీంతో వినియోగదారులపై ఎలాంటి భారమూ లేకుండా, సిస్టమ్ సజావుగా నడుస్తోంది.
UPI పెరుగుదల ఎంత వేగంగా జరిగిందో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2017-18లో కేవలం 92 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. అయితే, 2024-25 నాటికి ఈ సంఖ్య అద్భుతంగా పెరిగి 18,587 కోట్లకు చేరుకుంది. లావాదేవీల విలువ పరంగా చూసినా భారీ పెరుగుదల కనిపించింది రూ. 1.10 లక్షల కోట్ల నుంచి రూ. 261 లక్షల కోట్ల వరకు విస్తరించింది. అంటే, కేవలం ఏడు సంవత్సరాల్లోనే UPIకి 114% సగటు వార్షిక వృద్ధి నమోదైంది. అంతేకాకుండా, జూలై 2025లో ఒకే నెలలో 1,946 కోట్లకుపైగా లావాదేవీలు జరగడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది.
UPI ఇప్పుడు కేవలం నగరాల్లోని పెద్ద వ్యాపారులకే పరిమితం కాకుండ చిన్న దుకాణదారులు, రైతులు, ఉద్యోగులు, గ్రామాల్లో నివసించే సాధారణ ప్రజలు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. చాయ్ లాంటి చిన్న చెల్లింపులైనా, షాపింగ్ వంటి పెద్ద లావాదేవీలైనా, ఇప్పుడు ఒక్క టచ్‌తో సులభంగా పూర్తవుతున్నాయి.
డిజిటల్ చెల్లింపుల పెరుగుదలలో UPI మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థలోనే పెద్ద మార్పు జరిగింది. 2017-18లో దేశంలో 2,071 కోట్ల డిజిటల్ లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ 2024-25 నాటికి ఈ సంఖ్య 22,831 కోట్లకు పెరిగింది. లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగి, రూ. 1,962 లక్షల కోట్ల నుంచి రూ. 3,509 లక్షల కోట్లకు చేరింది.
UPI ప్రజల్లో వేగంగా పాపులర్ కావడానికి ప్రధాన కారణం దీని సౌలభ్యం మరియు ఉచిత సేవ. బ్యాంక్ లావాదేవీలు గంటలు పట్టినా, UPIలో కొన్ని సెకన్లలోనే డబ్బు పంపించవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా 24/7 ఉపయోగించుకునే వీలుంది. పిన్ సిస్టమ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి భద్రతా చర్యలు ఉండటంతో ప్రజలు నమ్మకంగా వాడుతున్నారు. మరో ముఖ్య కారణం చిన్న టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు, గ్రామాల్లో రైతుల నుంచి ఆన్‌లైన్ యాప్‌ల దాకా ఎక్కడైనా వాడుకునే సౌకర్యం ఉండటమే. ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా UPIని బలంగా ప్రోత్సహించడం వల్ల ఇది మరింత వేగంగా విస్తరించింది. ఇప్పుడు విదేశాల్లో కూడా UPI సేవలు ప్రారంభం కావడంతో, భారతీయులకే కాకుండా ప్రపంచానికి కూడా ఇది ఒక ఆదర్శ చెల్లింపు వ్యవస్థగా మారింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications