Gold: మీ ఇంట్లో బంగారం ఉందా? కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్.. భారీ లాభాలు!

భారతీయులకు బంగారం (gold) అంటే ఉన్న సెంటిమెంట్, ప్రేమ ప్రపంచంలో మరెవరికీ ఉండదు. మన ఇంట్లో పెళ్లి జరిగినా, పండగ వచ్చినా ఎంతో కొంత పసిడి కొనడం మన ఆనవాయితీ. అయితే, ఈ బంగారు ప్రేమే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సవాల్‌గా మారింది.
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి కావడంతో, ప్రతి ఏటా వేల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై భారం పడటమే కాకుండా, వాణిజ్య లోటు కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక క్రేజీ స్కీమ్‌ను మళ్లీ లైన్‌లోకి తెస్తోంది. అదే 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్'.

Government Reviews Gold Monetisation Scheme To Cut Imports And Boost Returns

అప్పట్లో ఎందుకు క్లిక్ అవ్వలేదు?

నిజానికి ఈ స్కీమ్‌ను 2015లోనే ప్రారంభించారు. ఇళ్లలో, దేవాలయాల లాకర్లలో వృథాగా పడి ఉన్న బంగారాన్ని (gold) బ్యాంకుల వద్ద డిపాజిట్ చేస్తే.. దానికి బదులుగా ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. దీనివల్ల విదేశాల నుంచి కొత్తగా బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుందని అప్పట్లో భావించారు.

కానీ, మన దేశంలో బంగారంపై ఉన్న సెంటిమెంట్ వల్ల ఈ స్కీమ్ ఆశించినంత సక్సెస్ కాలేదు. గత ఏడాది (2024) చివరి నాటికి కేవలం 31,000 కిలోల బంగారం మాత్రమే ఈ పథకం కింద డిపాజిట్ అయింది. పైగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం, ఆర్థిక నష్టాల భయం వల్ల.. ప్రభుత్వం 2025లో ఈ స్కీమ్‌లోని మీడియం, లాంగ్ టర్మ్ డిపాజిట్ ఆప్షన్లను నిలిపివేసింది.

ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు?

ప్రస్తుతం దేశంలో బంగారం (gold) దిగుమతులు మళ్లీ పెరిగిపోతున్నాయి. కరెంట్ అకౌంట్ లోటు పెరగకుండా చూసుకోవడానికి పాలసీ మేకర్లు ఈ స్కీమ్‌ను సరికొత్తగా రీ-డిజైన్ చేయాలని చూస్తున్నారు. ఈసారి ప్రజలను ఆకట్టుకోవడానికి మరికొన్ని ఎక్కువ వడ్డీ రేట్లను ప్రవేశపెట్టడం, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే నియమాలను సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం వంటి మార్పులు చేయబోతున్నారు.

ఇటీవలే ప్రభుత్వం బంగారం, వెండిపై ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం) పెంచిన సంగతి తెలిసిందే. కేవలం పన్నులు పెంచడం మాత్రమే కాకుండా, దేశంలో ఉన్న బంగారాన్నే మార్కెట్లోకి తెచ్చేలా ఈ మానిటైజేషన్ విధానాన్ని మార్చాలని జ్యువెలరీ అసోసియేషన్లు కూడా కోరుతున్నాయి.
ఈ పథకం గనుక సక్సెస్ అయితే.. విదేశాలపై మన ఆధారపడటం తగ్గుతుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా, ఇంట్లో ఊరికే లాకర్లలో పెట్టే బంగారం (gold) ద్వారా ప్రజలు ప్రతి నెలా మంచి ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ప్యాసివ్ అసెట్‌గా ఉన్న గోల్డ్‌ను దేశ ప్రగతికి ఉపయోగపడేలా మార్చడమే కేంద్ర ప్రభుత్వం యొక్క అసలు లక్ష్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+