ఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో LICని పబ్లిక్ ఇష్యూకు తెచ్చే లక్ష్యంతో ఉన్న కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసున్నది. సంస్థ ఆథరైజ్డ్ క్యాపిటల్ గణనీయంగా రూ.25 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీంతో రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 2,500 కోట్ల షేర్లను IPOలో ఉంచే వీలు కలుగుతుంది. అయితే, నిబంధనల ప్రకారం మొత్తం ఒకేసారి ఇష్యూలో ఉంచాల్సిన అవసరం ఉండదు. అవసరాన్ని బట్టి దశల వారీగా 2,500 కోట్ల షేర్లను విక్రయించే వెసులుబాటు కలుగుతుంది. దీనికి బోర్డ్ అనుమతి తప్పనిసరి కాదు. ప్రస్తుతం, 29 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న LIC పెయిడప్ క్యాపిటల్ రూ.100 కోట్లుగా ఉంది.
1956లో రూ.5 కోట్ల ప్రారంభ మూలధనంతో ప్రారంభమైన LICకి ప్రస్తుతం రూ.31,96,214.81 కోట్ల వ్యాల్యూ చేసే ఆస్తులు ఉన్నాయి. LIC చట్టం 1956లో ప్రతిపాదించిన సవరణ ప్రకారం LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ వాటా మూలధనం రూ.25 వేల కోట్లుగా ఉండనుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10 చొప్పున 2,500 కోట్ల షేర్లను విభజించే అవకాశముంది.

బడ్జెట్ 2021లో ప్రతిపాదించిన సవరణల మేరకు లిస్టింగ్ నిర్వహణ బాధ్యతలను చూసుకునేలా స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేస్తారు. మొత్తం 27 సవరణలను ప్రతిపాదించారు. లిస్టింగ్ అనంతరం తొలి అయిదేళ్ల పాటు సంస్థలో 75 శాతం వాటాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆ తర్వాత ప్రభత్వం శాశ్వతంగా 51 శాతం వాటాలను అట్టిపెట్టుకొని నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇందులో సబ్‌స్క్రైబర్లకు 10 శాతం వాటాల్ని రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ గత పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.
More From GoodReturns

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications