Power Stock: ఎనర్జీ స్టాక్ వెంటపడుతున్న ఇన్వెస్టర్స్.. నేడు 14% పైకి ఎందుకంటే?
SJVN Stock: ఎనర్జీ రంగంలో పనిచేస్తున్న అనేక కంపెనీల షేర్లు ప్రస్తుతం స్వర్ణ యుగాన్ని చూస్తున్నాయి. ఈ కంపెనీలకు బంగారు సమయం ఇంకా ముందుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు భారీ ఆర్డర్లను చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రభుత్వ యాజమాన్యంలోని ఎనర్జీ కంపెనీ SJVN లిమిటెడ్ షేర్ల గురించే. ఈ క్రమంలో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో దాదాపు 14 శాతం లాభపడ్డాయి. వాస్తవానికి ఈ భారీ పెరుగుదలకు కారణం కంపెనీ రూ.14,000 కోట్లు విలువైన కొత్త ఆర్డర్ పొందటమని తెలుస్తోంది. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీ ఈ మెగా ఆర్డర్ పొందింది. ఉదయం 11.22 గంటల సమయంలో NSEలో కంపెనీ షేర్ల ధరను పరిశీలిస్తే రూ.152.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

మిజోరం ప్రభుత్వం డార్జో లూయి పంప్‌డ్ స్టోరేజీని కంపెనీకి అప్పగించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్‌లో SJVN లిమిటెడ్ తెలిపింది. తువై నదిపై కంపెనీ 2400 MW పనిని పొందింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ రూ.13,947.50 కోట్లుగా ఉంది. కంపెనీ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది. అలాగే IREDAతో కలిసి SJVN నేపాల్‌లో 900 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పనిని పొందింది.
2024లో ఇప్పటివరకు కంపెనీ షేర్ల ధర 67 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది. అలాగే గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్ల ధరలు 155 శాతం పెరిగాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 55 శాతం వాటాలను హోల్డ్ చేస్తుండగా.. రిటైల్ ఇన్వెస్టర్లు 11.83 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నారు. బీఎస్ఈలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.170.45గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.60 వేల కోట్లకు పైగా ఉంది.


Click it and Unblock the Notifications