Green hydrogen hubs: 'గ్రీన్ హైడ్రోజన్' తయారీ హబ్‌లు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాయిటర్స్ సంస్థ నుంచి విశ్లేషణలు వెలువడుతున్నాయి. మే చివరి నాటికి బిడ్‌లు ఆహ్వానించనున్నట్లు తెలిసింది. కాలుష్యాన్ని తద్వారా గ్లోబల్ వార్మింగ్‌ని నియంత్రించేందుకు గ్రీన్ హైడ్రోజన్ వాడకం వైపు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. దీనిని ప్రమోట్ చేసేందుకు గాను.. 2 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను గతవారం ప్రకటించింది. ఈ రంగంలో అంతర్జాతీయ ఎగమతిదారుగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఏమిటీ గ్రీన్ హైడ్రోజన్...
పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి ఎలక్ట్రోలైజర్స్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేస్తారు. ఎరువులు, ఉక్కు ఉత్పత్తి, రవాణా రంగంలో ఎక్కువగా వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ తరహా ఫ్యాక్టరీలను నెలకొల్పడంతో రిలయన్స్, అదాని వంటి పెద్ద సంస్థలను ఆకర్షించాలని చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత ప్రాజెక్టుల్లో మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ఈ సంస్థలు ఇప్పటికే మొగ్గు చూపుతున్నాయి. అయితే ఈ నిర్ణయం భారత కుబేరుడు ముఖేష్ అంబానీకి భారీగా కలిసిరానుంది.

ఇవీ ఇబ్బందులు:
ఇదే సమయంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఆధారిత రెండు ఎరువుల ప్లాంట్‌లు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలు సైతం ఈ విభాగంలో అడుగు పెట్టాలని చూస్తున్నాయి. రవాణా ఛార్జీలు, ఎలక్ట్రోలైజర్స్ తయారీకి భారీగా ఖర్చు పెట్టాల్సి రావడంతో వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఒకే దెబ్బతో రెండు పిట్టలు మాదిరిగా.. దేశీయంగా ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు కొత్త తరహా ఇంధన వనరుని వాడుకోవడానికి మార్గం సుగమం కానుంది.

ఉక్కులో 100 శాతం..
'నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్' ద్వారా 2035 నాటికి అమోనియా ఆధారిత ఎరువులు దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ వాడకం ద్వారా డిమాండ్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది. 2030 నాటికి ఏటా ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉక్కు ఉత్వత్తిలోనూ 100 శాతం గ్రీన్ హైడ్రోజన్‌ని విరివిగా ఉపయోగించుకునేందుకు సిద్ధపడుతోంది. అయితే ఈ విషయాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతను అందించలేదు.


Click it and Unblock the Notifications