NRIలకు గుడ్‌న్యూస్: ఎయిరిండియాలో 100% వాటాకు ఓకే, వారికి అనుమతి లేదు
ఎయిరిండియా ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు దక్కించుకునేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కంపెనీల చట్టానికి తలపెట్టిన 72కు పైగా సవరణలకు బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ చట్టంలో పేర్కొన్న కొన్ని అపరాధాలను నేరాలుగా పరిగణించడం నిలిచిపోతుంది. రాజీకి అవకాశమున్న 66 అపరాధాల్లో 23 అపరాధాల్ని పునర్వ్యవస్థీకరిస్తారు.

వంద శాతం ఈక్విటీకి ఆమోదం
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఎయిరిండియా ఈక్విటీలో ఎన్నారై వంద శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇది ప్రవాసవాసులైన భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను సవరించనున్నట్లు ప్రకటించింది. ఎయిరిండియాలో మొత్తం వాటా కొనుగోలుకు ఎన్నారైలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది.

నేరుగా బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు
ఆటోమేటిక్ పద్ధతిలో వీరు నేరుగా ఇందుకోసం బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు. హిందుజాలతో సహా పలువురు ఎన్నారైలు భారత విమానయాన రంగంలో ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నారు. దేశీయ విమానయాన సంస్థల ఈక్విటీ, విదేశీ సంస్థల పెట్టుబడులు 49 శాతం మించకూడదనే నిబంధనే నిబంధన ఎయిరిండియాకు వర్తిస్తుంది. దీంతో అంతర్జాతీయ విమానయాన సంస్థలు దీనిపై ఆసక్తి చూపించదని భావిస్తున్నారు.

దేశీయ పెట్టుబడులుగానే..
ఎయిరిండియా నిర్ణయం ఓ మైలురాయి అని, సంస్థలో 100% పెట్టుబడులకు ఎన్నారైలు అనుమతిని పొందారని కేబినెట్ నిర్ణయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎయిరిండియా వ్యూహాత్మక విక్రయంలో పాల్గొనడానికి ఎన్నారైలకూ అవకాశం వచ్చిందని, వారు మొత్తం సంస్థను సొంతం చేసుకోవచ్చన్నారు. ఎన్నారై పెట్టుబడుల్ని దేశీయ పెట్టుబడులుగానే పరిగణిస్తామని చెప్పారు. ఇది ఎస్ఓఈసీ నిబంధనలకు విరుద్ధమేమీ కాదన్నారు.

వారికి అనుమతి లేదు..
ఇదివరకు ఎయిరిండియాలో ఎన్నారైలకు 49 శాతం వాటానే పొందే వీలు ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కొన్ని నియమాలకు లోబడి షెడ్యూల్డ్ దేశీయ విమానయాన సంస్థల్లో 100 శాతం FDIలకు అనుమతిచ్చారు. అయితే విదేశీ ఎయిర్ లైన్స్, ఇతర విదేశీ పెట్టుబడులకు ఉన్న 49 శాతం పరిమితిని అలాగే ఉంచారు.


Click it and Unblock the Notifications