NTPC Q2 Results: అదరగొట్టిన ప్రభుత్వ పవర్ కంపెనీ.. క్యూ2లో లాభాల మోత..
NTPC Q2 Results: ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పవర్ జనరేటింగ్ కంపెనీ NTPC లిమిటెడ్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది. ఈ క్రమంలో మెరుగైన పనితీరును కనబరిచింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.4726.4 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.3,417.67 కోట్లతో పోలిస్తే 38.3 శాతం అధికం. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.2.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డ్ ఆమోదం తెలిపింది. నవంబర్ 23న కంపెనీ డివిడెండ్ చెల్లించనుంది.

సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.44,983.35 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ త్రైమాసిక ఆదాయం 1.8 శాతం తక్కువగా రూ.44,175.03 కోట్లుగా నిలిచింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న NTPC Ltd భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ, ఇది దేశ విద్యుత్ అవసరాల్లో 25 శాతాన్ని తీరుస్తోంది. వాస్తవానికి విశ్లేషకులు అంచనాలను తాజా త్రైమాసిక లాభాలు అందుకోలేకపోయాయి. వాస్తవానికి నికర లాభం రూ.5,591.8 కోట్లు, ఆదాయం రూ.42,569.1 కోట్లుగా ఉండొచ్చని వారు అంచనా వేశారు.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 90.302 బిలియన్ యూనిట్ల(BU) స్థూల విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసింది. అలాగే క్యాప్టివ్ మైన్స్ నుంచి ఉత్పత్తి చేయబడిన బొగ్గు త్రైమాసికంలో 5.59 MMTగా గత ఏడాది కంటే 29.4 శాతం అధికంగా నిలిచింది. సెప్టెంబరు 1, 2023న దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రికార్డు స్థాయిలో దాదాపు 240 GW విద్యుత్ డిమాండ్‌ను సాధించింది. స్వతంత్ర ప్రాతిపదికన Q2FY22-23లో 57,639 MW నుంచి 57,838 MW స్థాపిత సామర్థ్యాన్ని NTPC కలిగి ఉన్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications