Coal India: కోల్ ఇండియాలో కేంద్రం వాటాల విక్రయం.. స్టాక్ పతనం.. ఏం చేయాలి..??
Coal India: ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియాలో 3 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటిని ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో అమ్మాలని భావిస్తోంది.
ఈ విక్రయం కోసం ఒక్కో షేరు ధరను ప్రభుత్వం రూ.225గా నిర్ణయించింది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ ధర 4.52 శాతం మేర తగ్గి రూ.230.35గా క్లోజ్ అయింది. ఈ నష్టాల కారణంగా ఎన్ఎస్ఈలో స్టాక్ టాప్ లూజర్ గా ప్రయాణాన్ని ముగించింది. ప్రభుత్వం కోల్ ఇండియాలో వాటాను ఆఫ్‌లోడ్ చేయాలని చూస్తున్నందునజూన్ 1న నిఫ్టీ-50 ప్యాక్‌లో అత్యంత చెత్త ప్రదర్శనను కనబరిచింది.

ప్రస్తుతం కోల్ ఇండియా షేర్ ధర కొంత తగ్గినప్పటికీ అది ఇన్వెస్టర్లకు కొనుగోలు చేసేందుకు సరైన అవకాశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో తయారీ రంగం వేగం పుంజుకోవటం, గ్రామీణ విద్యుదీకరణ విద్యుత్ డిమాండ్ ను భారీగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70-75 శాతం థర్మల్ ప్లాంట్ల ద్వారా జరుగుతోంది. పైగా ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 80-85 శాతం విద్యుత్ రంగానికి సరఫరా అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
జూన్ 1, 2 తేదీల్లో రిటైల్, నాన్ -రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కోల్ ఇండియా షేర్ల ఆఫర్ ఫర్ సేల్ తెరవబడుతుంది. బొగ్గు ఉత్పత్తిదారులో 1.5 శాతం వాటాతో 9.24 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేయాలనేది ప్రభుత్వ ప్రతిపాదనగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ విషయంలో సమాన మొత్తంలో వాటాను విక్రయించడానికి గ్రీన్ షూ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. బొగ్గు అతిపెద్ద సరఫరాదారు హై గ్రేడ్ G2-G10 నాన్-కోకింగ్ బొగ్గు విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,700 కోట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications