Windfall Tax: భారత ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నుల విషయంలో కీలక ప్రకటన చేసింది. గత నెల ఈ పన్నును తగ్గించిన కేంద్రం తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది.
భారత ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును నవంబర్ 1 నుంచి టన్నును రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచినట్లు ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో డీజిల్ ఎగుమతులపై పన్నును తగ్గించగా.. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై ప్రభుత్వం మంగళవారం విండ్ ఫాల్ ప్రాఫిట్ పన్నును పెంచుతున్నట్లు ప్రకటించింది.

దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ముడి చమురుపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ లేదా SAED రూపంలో విధించే పన్ను టన్నుకు రూ.9,800కి పెరిగింది. ఇదే క్రమంలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విండ్ ఫాల్ ట్యాక్స్ లీటరుకు రూ.1 నుంచి సున్నా రూపాయలకు తగ్గించినట్లు నోటిఫికేషన్ వెల్లడించింది. అలాగే డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని లీటర్‌కు రూ.4 నుంచి రూ.2కి తగ్గించింది.

భారత ప్రభుత్వం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించిన సంగతి తెలిసిందే. దేశంలో గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్‌ఫాల్ పన్నును తొలిసారిగా విధించారు. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. ప్రైవేట్ రిఫైనర్లు స్థానికంగా విక్రయించటానికి బదులుగా విదేశీ మార్కెట్లలో అమ్మటం ద్వారా బలమైన రిఫైనింగ్ మార్జిన్లు పొందటాన్ని అరికట్టేందుకు కేంద్రం దీనిని ప్రవేశపెట్టింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications