అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా సహా ఒపెక్ దేశాలు డిమాండ్ పెంచే లక్ష్యంతో ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఓ వైపు కరోనా కేసులు తగ్గి డిమాండ్ పెరగడంతో పాటు, చమురు ఉత్పత్తి దేశాల నిర్ణయం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల పెరుగుతున్నాయి. గత వారం క్రూడాయిల్ ఫిబ్రవరి ఫ్యూచర్ 52.73 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. గత ఏడాది ఫిబ్రవరి నుండి మొదటిసారి దాదాపు 5 శాతం లాభంతో ముగిశాయి. ఈ ప్రభావం మన దేశంలోపై పడనుంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలు పెరిగితే, ఇది మన దేశంలో వినియోగదారులపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

అంతకంతకు ధరల పెరుగుదల
గతవారం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా విదేశీ మార్కెట్‌లో జంప్ చేస్తున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత పెరిగాయి. వచ్చేవారంత పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది లాక్ డౌన్ కాలంలో కేంద్రం పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, ఈ ట్యాక్స్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి.

కేంద్రం తగ్గిస్తే రూ.5 డౌన్
ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.84లో పన్ను వాటా రూ.50కి పైగా ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే లీటర్ పెట్రోల్ పైన కనీసం రూ.5 వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. దేశీయ చమురు రంగ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.

ఉత్పత్తి తగ్గింపు
గతవారం న్యూయార్క్ మార్కెట్‌లో నైమెక్స్ బ్యారెల్ ధర 2.8 శాతం ఎగిసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ బ్యారెల్ 3 శాతం పెరిగి 56 డాలర్లను తాకింది. కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోను ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ అరేబియా స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు ముందుకు వచ్చింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications