కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరడం లేదు. కరోనా మహమ్మారి ఈసారి దెబ్బ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో (2019-20) ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.లక్ష కోట్లుకు పైగా సమీకరించాలని భావించింది మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత రూ.65 వేల కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యం కూడా చేరుకోలేదు. రూ.50,298.64 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.14,700 కోట్ల దూరంలో ఆగిపోయింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.1.05 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఆ తర్వాత రూ.65 వేల కోట్లకు సవరించింది. THDC ఇండియా లిమిటెడ్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (NEEPCO)లను NTPCకి విక్రయించడంతో రూ.11,500 కోట్లు వచ్చాయి. కామరాజర్ పోర్టును చెన్నై పోర్టు ట్రస్ట్‌కు విక్రయించడం ద్వారా రూ.2,383 కోట్లు, రెండు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మరో రూ.26,500 కోట్లు, భారత్ 22 ఈటీఎఫ్‌ల ద్వారా రూ. 4,368 కోట్లు వచ్చాయి.

ఆర్వీఎన్ఎల్, ఐఆర్సీటీసీను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా రూ.1,113 కోట్లు, MOIL, MDL, SPMCIL బైబ్యాక్స్ ద్వారా మరో రూ.861 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.10 లక్షల కోట్ల నిధులను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications