కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO)ను మే నెల ప్రారంభంలో తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్ ద్వారా 5 శాతం కంటే కాస్త ఎక్కువ వాటాను విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీవో కోసం కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్స్ కోసం ప్రభుత్వం బ్యాంకర్లు, అడ్వైజర్లతో టచ్‌లో ఉంది. దీనిని ఫైనలైజ్ చేసే అంశంపై దృష్టి సారించింది. ఇటీవలి అంతర్జాతీయ అననుకూల పరిణామాల కారణంగా ఎల్ఐసీవో ఐపీవో ఆలస్యమయిందని చెబుతున్నారు.
మర్చంట్ బ్యాంకర్లు, ఆర్థిక సలహాదారులతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎల్ఐసీ ఐపీవోను మార్చిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో పబ్లిక్ ఇష్యూను వాయిదా వేసింది ప్రభుత్వం. గత కొద్ది రోజులుగా మార్కెట్లు రికవరీలో ఉన్నాయి. ప్రపంచం యుద్ధ భయాల నుండి బయటకు వచ్చింది.

దీంతో ఎల్ఐసీ ఐపీవోను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం ఫిబ్రవరి 13న సెబీకి ప్రభుత్వం డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించింది. దీనికి మార్చి 8న సెబి ఆమోదం లభించింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలతో కూడిన పత్రాలను కూడా సెబికి ఎల్ఐసీ సమర్పించింది. తాజాగా లభించిన అనుమతితో మే 12వ తేదీ వరకు పబ్లిక్ ఇష్యూను ప్రారంభించేందుకు అవకాశముంది. లేదంటే మరోసారి సెబి అనుమతి కోరవలసి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications