Budget 2024: బడ్జెట్‌లో ఆ ట్యాక్స్‌పై కీలక ప్రకటన.. 2018 నుంచి నో ఛేంజెస్, ఈసారైనా..
Budget News: మరో మూడు రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా పలు డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. వాటిలో మూలధన లాభాలకు సంబంధించిన పన్ను గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇతర పన్నులతో పోలిస్తే ఇది కొంత సంక్లిష్టంగా ఉండటం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌ఫ్లో పెరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై పార్లమెంటులో కీలక ప్రకటన వెలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్టాక్స్, భూమి, వాహనాలు, భవనాలు మరియు సెక్యూరిటీల విక్రయం ద్వారా వచ్చే రాబడిని ఆదాయపన్ను చట్టం 1961 కింద టాక్సబుల్ ఇన్కమ్ గా పరిగణిస్తారు. 2018లో అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లక్ష దాటిన మూలధన లాభాలపై 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు ఎటువంటి ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ను ప్రతిపాదించలేదు. దీంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దీని గురించి మాట్లాడతారని నిపుణులు చెబుతున్నారు.

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఫ్రేమ్ వర్క్ కు సంబంధించి పలుమార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టాక్స్ మరియు రియాల్టీ రంగాలు ప్రభుత్వ నిర్ణయంతో బెనిఫిట్ పొందవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ పన్ను విధానాన్ని మరింత సరళీకరిస్తే పెట్టుబడిదారుల సానుకూలంగా స్పందిస్తారని, తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం ఉంటుందనే వాదన ఉంది.
2018లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఉన్న 1 లక్ష పరిమితిని మార్చలేదు. కాబట్టి పన్ను పరిధిలోకి రాని మూలధన లాభాల మొత్తాన్ని పెంచవచాలని కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తులు అందాయి. నిబంధనలను సులభతరం చేయడానికి మరియు అసమానతలను తగ్గించడానికి సెక్యూరిటీలు మినహా ఇతర స్థిర, చరాస్తుల కోసం 36 నెలల హోల్డింగ్ వ్యవధిని ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications