ఒత్తిడిలోని 26రంగాలకు భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్, 5 ఏళ్ల కాలపరిమితి, మార్చి 31 వరకు గడువు
న్యూఢిల్లీ: కామత్ కమిటీ గుర్తించిన ఒత్తిడిలో కూరుకుపోయిన వివిధ రంగాలకు క్రెడిట్ మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా కారణంగా 26రంగాలు భారీగా దెబ్బతిన్నట్లు కామత్ కమిటీ గుర్తించిందని తెలిపారు. ఇందులో హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఉందన్నారు. ఈ పథకం కింద అదనపు క్రెడిట్ కాలపరిమితి 5 ఏళ్లుగా తెలిపారు.
ఈ పథకంలో ప్రిన్సిపుల్ అమౌంట్ తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఏడాది పాటు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ స్కీం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం అర్హత కోసం టర్నోవర్ పరిమితి లేదని తెలిపారు. 10 రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీం లాంచ్ చేసినట్లు తెలిపారు.

ఈ 10 రంగాలకు...
ఆత్మనిర్భర్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీంలో అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ (రూ.18,100 కోట్లు), ఎలక్ట్రానిక్స్/టెక్నాలజీ ప్రోడక్ట్స్ (రూ.5,000 కోట్లు), ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్ (రూ.57,042 కోట్లు), ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ (రూ.15,000 కోట్లు), టెలికం అండ్ నెట్ వర్కింగ్ ప్రోడక్ట్స్ (రూ.12,195 కోట్లు), టెక్స్‌టైల్ ఉత్పత్తులు (రూ.10,683 కోట్లు), ఫుడ్ ప్రోడక్ట్స్ (రూ.10,900 కోట్లు), హైఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ (రూ.4500 కోట్లు), వైట్ గూడ్స్ (ఎసీలు, ఎల్ఈడీలు) (రూ.6,238 కోట్లు), స్పెషలిటీ స్టీల్ (రూ.6,322 కోట్లు) ఉన్నాయి.

ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ కింద రూ.2.05 లక్షల కోట్లు మంజూరు
ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీం కింద ఇప్పటి వరకు 61 లక్షల రుణగ్రహీతలకు రూ.2.05 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు నిర్మల తెలిపారు. ఇందులో రూ.1.52 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వడ్డీరహిత రుణాల కోసం 11 రాష్ట్రాలకు రూ.3,621 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అదనపు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ట్రాన్సుపోర్ట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు రూ.25,000 కోట్లు సమకూర్చినట్లు తెలిపారు. మే నెలలో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు.

బలమైన రికవరీ
దేశంలో బలమైన రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని నిర్మల తెలిపారు. గత 10- 5 రోజులుగా చూస్తుంటే బలమైన రికవరీ సూచనలు కనిపిస్తున్నాయన్నారు.
జీఎస్టీ కలెక్షన్లు, బ్యాంక్ క్రెడిట్స్, ఎఫ్‌డీఐ ఫ్లో ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వన్ నేషన్-వన్ రేషన్ కిందకు తీసుకు వచ్చామని, దీని కిందకు 68.6 కోట్ల మంది భారతీయులు వచ్చారన్నారు. అక్టోబర్‌లో జీఎస్టీ కలెక్షన్లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగాయని, బ్యాంకు క్రెడిట్స్ 5.1 శాతం పెరిగిందని, ఎనర్జీ వినియోగం కూడా రికార్డ్‌స్థాయికి పెరిగిందన్నారు. పీఎం-కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కోసం 183.14 లక్షల కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులకు అదనపు ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ కింద నాబార్డు ద్వారా రూ.25,000 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. ఎన్బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్ఎస్‌లకు స్పెషల్ లిక్విడిటీ స్కీం ద్వారా రూ.7,227 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications