Insurance: వాహన యజమానులకు శుభవార్త.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కొత్త రేట్లు విడుదల..
Insurance: వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023-24కి గాను వెహికల్ ఇన్యూరెన్స్ ప్రీమియం రేట్లకు సంబంధించి e-గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. థర్డ్ పార్టీ బీమా రేట్లలో ఎటువంటి మార్పు ఉండబోదని ప్రకటించింది. ఈ మేరకు ఆయా వాహనాల ఇన్సూరెన్స్ రేట్లను అందులో వెల్లడించింది.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రీమియం రేట్ల ప్రకారం.. 1000cc దాటని ప్రైవేట్ కార్లకు 2 వేల 94, 1000-1500 cc వాహనాలకు 3 వేల 416 మరియు 1500cc పైబడిన వాటికి 7 వేల 897 చొప్పున థర్డ్ పార్టీ బీమా కోసం ప్రీమియం చెల్లించాలి. ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. 75cc లోపు 538, 75-150 మధ్య బైక్స్‌కు 714, 150-350cc ఉంటే 1366, 350cc దాటితే 2 వేల 804 వెచ్చించాల్సి ఉంటుంది.

ఏదైనా అనుకోని దుర్ఘటన సంభవిస్తే పాలసీ హోల్డర్‌కు కాకుండా బాధిత మూడో పక్షానికి ఆర్థిక సహాయాన్ని అందించే విధానమే ఈ "థర్డ్ పార్టీ కవర్". వాహన యజమాని వల్ల ఇతరులకు లేదా వారి వాహనాలకు ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో రక్షణ కోసం ఈ బీమా పాలాసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వాహన యజమాని దీని కవరేజీలోకి రాడని గుర్తుంచుకోవాలి.

మోటారు వాహనాలకు థర్డ్ పార్టీ బీమా పాలసీ తీసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం వాహన యజమానులందరూ ఈ లయబిలిటీ కింద ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. వాణిజ్య మరియు ప్రైవేట్ వాహనాలకు ఈ తరహా బీమా కవర్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications