ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతోకొంత మొత్తం పొదుపు చేసుకోవడం అవసరం. అందుకుగాను సంప్రదాయ ఫిక్స్డ్ డిపాడిట్లతో పాటు వివిధ రకాల పోస్టాఫీస్ ఆధారిత పథకాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వీటిలో ఎంచుకున్న కాల వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లు సైతం మారుతూ ఉంటాయి. ఇటీవల ఈ స్కీమ్స్ పై వడ్డీరేట్లను ప్రభుత్వం పెంచడంతో వీటికి క్రేజ్ ఏర్పడింది.
ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పెంచిన వడ్డీ రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. గడచిన ఏడాదిలో వీటిపై వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. సవరించిన ఈ రేట్ల ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చు, ఆదాయాలను ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో ఇటీవల ఉన్న వడ్డీరేటును 6.2 నుంచి 6.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇది జూలై నుంచి సెప్టెంబరు వరకు వర్తించనుంది. ఇందులో సంవత్సరానికి 10 వేల చొప్పున పెట్టుబడి పెడితే, ఏడాది చివరికి వడ్డీగా 650 పొందే అవకాశం ఉంది. ఈ పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు కాగా కనీస డిపాజిట్ 100 చొప్పున నెలవారీ డబ్బును డిపాజిట్ చేయవచ్చు.
ఏడాది కాలవ్యవధిగా ఉన్న పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పై వడ్డీ రేటు ప్రస్తుతం 6.9 శాతానికి పెంచబడింది. రికరింగ్ డిపాజిట్ తో పోలిస్తే ఇందులో మరికొంత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. వడ్డీ కూడా 3 నెలలకు లెక్కించబడుతుంది. కనీసం వెయ్యితో ఖాతాను తెరవవచ్చు. పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు. డిపాజిట్ చేసిన మొత్తాన్ని 6 నెలల తర్వాతే విత్ డ్రా చేయగలం.
ఇక రెండేళ్ల వ్యవధి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లో వడ్డీ రేటు 7 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంచుకున్న ప్రకారం త్రైమాసిక, వార్షిక వడ్డీ ఆదాయం మీ ఖాతాకు జమవుతుంది. ఐదేళ్ల పెట్టుబడికి గాను ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. 1.5 లక్షల వరకు దీనిద్వారా మినహాయింపు లభిస్తుంది.


Click it and Unblock the Notifications