దేశీయ విమాన ఛార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను 10 శాతం నుండి 30 శాతం వరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పెంచింది. దీంతో దేశీయ విమాన ప్రయాణీకులపై భారం పడనుంది. పెరిగిన ఈ ధరలు మార్చి 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయి. కరోనా నేపథ్యంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత 2020 మే 25న దేశీయ విమానాలను పునః ప్రారంభం తర్వాత ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణుల్లో విభజించి, పరిమితులు విధించారు. కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల సగటు ధర కంటే తక్కువకే కనీసం 40 శాతం టికెట్లు విక్రయించాలి. ఇప్పుడు ఈ పరిమితిని పెంచడంతో కాస్త భారం కానుంది.

అందుకే పెరగనున్న ధరలు
డొమెస్టిక్ విమాన చార్జీలు 30 శాతం వరకు పెరగవచ్చు. కరోనా నేపథ్యంలో విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులతో పాటు సీటింగ్ సామర్ధ్యంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విధించిన పరిమితులు మార్చి 31వ తేదీతో ముగుస్తున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్త మార్గాల్లో విమాన చార్జీల కనిష్ట పరిమితిని 10 శాతం, గరిష్ట పరిమితిని 15 శాతం పెంచినట్టు విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ధరలు పెరగనున్నాయి.

ఇలా పెంచారు
దేశంలో క్రమంగా కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటున్నామని, దేశీ విమానాల చార్జీల శ్రేణిపై విధించిన పరిమితులను తొలగించే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవలే అన్నారు. తర్వాతి రోజే విమాన చార్జీల శ్రేణిని ప్రభుత్వం సవరించింది. విమానయాన సంస్థల సామర్థ్యంలో 80 శాతం సర్వీసులే ఈ ఏఢాది మార్చి 31 వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది మొదట 33 శాతం, జూన్ 26 నుండి 45 శాతం, సెప్టెంబర్ 2 నుండి 60 శాతం, నవంబర్ 11న 70 శాతం, డిసెంబర్ 3న 80 శాతానికి పెంచారు.

పరిమితులు..
ప్రస్తుతం 40 నిమిషాల్లోపు ప్రయాణంపై కనిష్టంగా 2000, గరిష్టంగా 6000, ఉండగా, ఇకముందు కనిష్టం 2200, గరిష్టం 7800గా ఉంటుంది. ఇలా ఏడు శ్రేణుల పరిమితి క్రమంగా పెరుగుతుంది. 40-60 నిమిషాలు, 60 నుండి 90 నిమిషాలు, 90 నుండి 120 నిమిషాలు, 120 నుండి 150 నిమిషాలు, 150 నుండి 180 నిమిషాలు, 180 నుండి 210 నిమిషాలు ఉన్నాయి. చివరి శ్రేణిలో కనిష్టం 6500, గరిష్టం 18600 ఉండగా, ఇకపై 72000, 24200 ఉంటుంది.


Click it and Unblock the Notifications