ప్రభుత్వరంగ బీమా దిగ్గజం LIC చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో IPO ప్రతిపాదన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఈ నెల చివరలో పదవీ విరమణ చేయవలసిన కుమార్ పదవీ కాలాన్ని మార్చి 31వ తేదీ వరకు పొడిగించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసుల సూచనకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇందుకు సంబంధించి బీమా కార్పొరేషన్ యాక్ట్, 1956 చట్టాన్ని కూడా సవరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించాలని ప్రకటించారు. అలాగే డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించారు.

కుమార్ 1983లో ఎల్ఐసీలో చేరారు. 2019 మార్చి 13వ తేదీన ఎల్ఐసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తన నాలుగు పదుల కెరీర్‌లో ఎల్ఐసీ సదర్న్ జోన్, నార్త్ సెంట్రల్ జోన్, నార్తర్న్ జోన్‌లలో బాధ్యతలు నిర్వర్తించారు. ఎల్ఐసీలో ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించి, ఎల్ఐసీలో వాటాను తగ్గించుకోనుంది. ఎల్ఐసీ వ్యాల్యూ 261 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ సమయంలో ఈ మేరకు ఉంటుందని భావిస్తున్నారు. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications