For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహనదారులకు కేంద్రం శుభవార్త, ఆ డాక్యుమెంట్స్ పర్మిట్ గడువు జూన్ 30 వరకు పొడిగింపు

|

కరోనా సెకండ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోటార్ వెహికిల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీని జూన్ 30, 2021 వరకు పొడిగించింది. గత కొద్దికాలంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్ డౌన్, కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం వాహనదారులకు భారీ ఊరట. డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) వంటి మోటార్ వాహనాల డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.

ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్(MoRTH) ప్రకటన చేసింది. కరోనా ఆంక్షల కారణంగా ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్స్ వ్యాలిడిటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1, 2020 లేదా మార్చి 31, 2021 మధ్య నాటికి ముగిసే డాక్యుమెంట్స్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది.

Government extends validity of driving licence, vehicle documents till June 30

గతంలో మార్చి 30, 2020, జూన్ 9, 2020, జూన్ 9, 2020, ఆగస్ట్ 24, 2020, డిసెంబర్ 27, 2020కి పెంచింది. మోటార్ వెహికిల్ యాక్ట్ 1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికి ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

English summary

వాహనదారులకు కేంద్రం శుభవార్త, ఆ డాక్యుమెంట్స్ పర్మిట్ గడువు జూన్ 30 వరకు పొడిగింపు | Government extends validity of driving licence, vehicle documents till June 30

The government on Friday extended the validity of motor vehicle documents like driving licence (DL), registration certificate (RC) and permits till June 30, 2021, in view of the ongoing COVID-19 pandemic.
Story first published: Friday, March 26, 2021, 20:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X