న్యూఢిల్లీ: ఎయిరిండియా కొనుగోలుకు ఆసకక్తి కలిగిన వారు బిడ్స్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పొడిగించినట్లు పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM) తెలిపింది. తాజా పొడిగింపుతో బిడ్స్ దాఖలు కోసం గడువు ఆగస్ట్ 31 చివరి తేదీ. కరోనా కారణం కావొచ్చు మరో కారణం కావొచ్చు ఇప్పటి వరకు బయ్యర్స్ దొకరలేదు. దీంతో డెడ్ లైన్ పొడిగించింది ప్రభుత్వం.

ఇది మూడోసారి
ఎయిరిండియా బిడ్స్ దాఖలును పొడిగించడం ఇది మూడోసారి. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ సంవత్సరం జనవరి 27వ తేదీన ప్రారంభమైంది. అప్పట్లో ఆసక్తి వ్యక్తికరణ బిడ్స్ దాఖలుకు మార్చి 17వ తేదీ వరకు గడువును ఇచ్చారు. అనంతరం ఏప్రిల్ 30వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత జూన్ 30వ తేదీకి మార్చారు. ఇప్పుడు మరోసారి ఆగస్ట్ 31వ తేదీ వరకు బిడ్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు సమాచారం ఇచ్చే గడువును సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దీమ్ తెలిపింది.

పెట్టుబడుల ఉపసంహరణ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏవియేషన్ రంగం భారీగా దెబ్బతిన్నది. అప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ఎయిరిండియా కరోనా కారణంగా మరింతగా నష్టపోయింది. మరోవైపు, పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో BPCL) 52.98 శాతం వాటాను విక్రయించేందుకు జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. మొదట మే 2వ తేదీ వరకు ఉన్న గడువును జూన్ 13కు, ఆ తర్వాత జూలై 31కి పొడిగించింది.

2018లో ప్రయత్నం విఫలం
ఎయిరిండియాలో వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం 2018లో ప్రయత్నం చేసింది. కానీ అది సఫలం కాలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో మరోసారి ఈ ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వ వాటాలను 100 శాతం విక్రయించేందుకు బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది. అనుబంధ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌లో 100 శాతం, ఎయిరిండియా సాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్‌లో 50 శాతం వాటా ఉంది. 2018లో 76 శాతం వాటా విక్రయించాలని భావించింది.

రూ.60,074 కోట్ల అప్పులు
మార్చి 31, 2019 నాటికి ఎయిరిండియా రుణాలు రూ.60,074 కోట్లుగా ఉన్నాయి. బిడ్ దక్కించుకున్న వారు రూ.23,286.5 కోట్ల రుణం భారమవుతుంది. మిగతా మొత్తాన్ని ఎయిరిండియా అసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AIAHL)కు బదలీ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లకు పైగా సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications