PAN-Aadhaar: ప్రస్తుతం ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలు పొందాలన్నా దానికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్లో పాన్ కార్డును అన్నిచోట్ల అంగీకరించేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఆధార్ పాన్ లింక్ చేయటాన్ని తప్పనిసరి చేసింది. దీనికోసం పలుమార్పులు గడువును సైతం పొడిగించింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఆధార్-పాన్ లింక్ చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ జూన్ 30 వరకు దేశంలోని ప్రజలకు అవకాశాన్ని కల్పించింది. ప్రజలు తప్పనిసరి ఆదాయపు పన్ను నిబంధనలను పాటించేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు మార్చి 31తో ముగుస్తుంది.

ఆదాయపుపన్ను శాఖ ప్రకారం ఈ రెండింటిని గడువులోపు లింక్ చేయకపోయినట్లయితే ఆ పాన్ కార్డులు పనిచేయకుండా పోతాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, బ్యాంక్ ఖాతా నిర్వహించాలన్నా ఇప్పుడు పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. అందుకే దేశంలోని రాజకీయ పార్టీలు ఆధార్-పాన్ కార్డులను లింక్ చేసేందుకు ప్రజలకు మరింత గడువు అందించాలని డిమాండ్ చేయటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
గతంలో ఈ రెండింటిని లింక్ చేసేందుకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అవకాశాన్ని కల్పించింది. అయితే ఏప్రిల్ 1, 2022 నుంచి ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి ప్రభుత్వం రూ.500 రుసుమును విధించింది. ఆ తర్వాత లేటు రుసుమును జూలై 1, 2022 నుంచి రూ. 1,000కి పెంచింది. గడువు లోపు రెండింటిని లింక్ చేయటంలో విఫలమైతే ఏప్రిల్ 1, 2023 నుంచి చట్టం ప్రకారం కార్డు హోల్డర్లు కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఒకసారి PAN కార్డు పనిచేయకుండా పోయినట్లయితే.. సంబంధిత పన్ను చెల్లింపుదారు దానిపై పన్ను వాపసు లేదా వడ్డీని క్లెయిమ్ చేయలేరు. అలాగే TDS, TCSలు వారి నుంచి ఎక్కువ శాతం వసూలు చేయబడతాయి. రూ.1,000 రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను తెలియజేసినప్పుడు.. 30 రోజుల్లో పాన్‌ను మళ్లీ ఆపరేట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. గడువును 6 నెలలు పెంచటంతో పాటు రూ.1000 రుసుమును తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి గతవారం లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications