GeM: మన దేశంలో వివిధ ఇ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా వినిపించే పేర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం సర్కారు 'గవర్నమెంట్ ఇ-మార్కెట్' పేరిట ఓ ప్లాట్‌ఫారమ్ మొదలు పెట్టింది. దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఓ రికార్డును సొంతం చేసుకుంది.
'గవర్నమెంట్ ఇ-మార్కెట్' లేదా GEM పోర్టల్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ నిర్వహణలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ గా చరిత్ర సృష్టించింది. మార్చి 31తో ముగిసే ప్రస్థుత ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం 4 లక్షల కోట్ల సేల్స్ విలువ కలిగి ఉంది. కాగా కొరియాకు చెందిన ఆన్-లైన్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ (KONEPS) మరియు సింగపూర్ GeBIZలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ మర్చండైజ్ వాల్యూ 100 శాతం పెరిగినట్లు GeM CEO PK సింగ్ తెలిపారు. డిజిటల్ ఇంక్లూజన్‌లో తన ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఆగస్టు 2016లో ప్రారంభించగా.. 2018-19లో ఆర్డర్‌ల మొత్తం విలువ 17.44 వేల కోట్లుగా నమోదైనట్లు చెప్పారు. ఇది క్రమంగా 2021-22లో 1.07 లక్షల కోట్లు, గతేడాది 2.01 లక్షల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను మరియు సేవలను GeM ద్వారా విక్రయించవచ్చు. గుడ్లు నుంచి క్షిపణి భాగాల వరకు ఈ పోర్టల్ ద్వారా బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. వీటిలో 50 శాతం ఉత్పత్తులు హస్తకళాకారులు, చేనేత కార్మికులు, MSME పరిశ్రమలు, స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్టార్టప్‌లకు సంబంధించినవే కావడం గమనార్హం.
5.20 లక్షలకు పైగా కామన్ సర్వీసెస్ సెంటర్‌లు (CSCలు) మరియు 1.50 లక్షలకు పైబడి ఇండియా పోస్ట్ ఆఫీస్‌లతో కలిసి దేశంలోని మారుమూల ప్రాంతాలను GeM అనుసంధానించిందని సింగ్ స్పష్టం చేశారు. విభిన్న విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు GeMలో తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నట్లు చెప్పారు. హైపర్-లోకల్ ఎకానమీలకు ఈ ప్లాట్‌ఫారమ్ ఊతం ఇస్తున్నట్లు వివరించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications