ఆర్థిక మందగమనం కారణంగా గత కొంతకాలంగా రెవెన్యూ కలెక్షన్లు తగ్గిన విషయం తెలిసిందే. డిమాండ్ తగ్గి, ఉత్పత్తి పడిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బ కూడా భారత ఆర్థిక వ్యవస్తపై పడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ప్రభుత్వం మూడు కీలక విధాన కార్యక్రమాలను పక్కన పెట్టినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మందగమనం తర్వాత.. కరోనా దెబ్బ
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇలాంటి పరిస్థితుల్లో వెజిటేబుల్ ఆయిల్ తదితరాలపై ఇంపోర్ట్ ట్యాక్సెస్ తగ్గించడం ఇందులో ఓ కీలకమైన అంశమని అంటున్నారు. గత ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఇప్పుడు కరోనా దెబ్బ పడుతోంది.

ఆయిల్ ధరలు అదుపులో ఉంచేందుకు..
ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలంలో ఆదాయపు పన్ను రెవెన్యూ 3.5 శాతం మేర తగ్గాయి. ఇతర ట్యాక్స్ ఆదాయాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దాదాపు 3.8 శాతం పెరిగాయి. దేశీయంగా ధరలను అదుపులో ఉంచేందుకు పామాయిల్ సహా ముడి, శుద్ధి వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై పన్నను 3.7 శాతం తగ్గించాలని జనవరిలో ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అయితే ఆదాయ సంక్షోభం ఎదుర్కొంటున్నందున దీనిని పక్కన పెట్టారు.

మరో రెండు..
కేవలం వెజిటబుల్ ఆయిల్స్ పైనే కాదు. ఆహార మంత్రిత్వ శాఖ చేసిన మరో కీలక ప్రతిపాదనను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పక్కన పెట్టింది. ఆ ప్రతిపాదన బియ్యం, గోదుమ సరఫరా పెంపు లక్ష్యం. అదే సమయంలో పేదరికంలో ఉన్న లక్షలాది మందికి విటమిన్-బలవర్ధక బియ్యం ఇవ్వాలని ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రణాళికను కూడా ఆర్థిక శాఖ పక్కన పెట్టింది. దీనికి రూ.5 ట్రిలియన్లు ఖర్చవుతుందని అంచనా.

కరోనా దెబ్బతో పలు పథకాలు, విధానాలు మందగించే ఛాన్స్
ఈ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కాకపోయినా మున్ముందు ప్రజలకు ఉపయోగపడేలా సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ కరోనా కారణంగా ప్రస్తుతం కీలక ప్రతిపాదనలు పక్కన పెట్టింది. గతంలో మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో అనేక విధానాలు, పథకాలు మందగించే అవకాశాలున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications