Free Scooty: మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా ఎలక్షన్ల హడావిడి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం దేశంలో ఆల్ ఫ్రీ పథకాల హవా నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే దివ్యాంగులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలని రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాలకు వెళ్లి వచ్చే వికలాంగ విద్యార్థులకు, వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వం స్కూటీలను పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ స్థానిక యువతకు ప్రయోజనకరంగా ఉంది. చదువుకోవాలనే కోరికకు ఉన్న ఆటంకాన్ని దాటేందుకు ఇది దోహదపడుతోంది.

రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఏడాది స్కూటీల పంపిణీ సంఖ్యను 2000 నుంచి 5000కు పెంచింది. దీని ద్వారా ఎక్కువ మంది వికలాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ స్కీమ్ కనీసం 50 శాతం శారీరకంగా వైకల్యంతో ఉన్న రాష్ట్రం పౌరులు అర్హులను వెల్లడించింది. అయితే తాజాగా దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి ద్విచక్ర వాహనం ఉండకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. 15-29 ఏళ్ల మధ్య వారికి మెుదటి ప్రాధాన్యత, 29-45 ఏళ్ల వారికి రెండవ ప్రాధాన్యత ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
స్కీమ్ కింద్ బండి పొందేందుకు వారు అధికారిక వెబ్‌సైట్ sso.rajasthan.gov.in దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వైకల్యం సర్టిఫికేట్, వయస్సు సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రాథమిక చిరునామా రుజువు, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత అవసరం. ఈ వివరాలను డిజిటల్ పద్ధతిలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడితే వికలాంగులకు ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక ప్రజారంజకమైన పథకాలతో తన పాలనను కొనసాగిస్తోంది. చూడాలి భవిష్యత్తులో ఇలాంటి స్కీమ్ మన రాష్ట్రంలో కూడా వస్తుందేమో.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications