For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొదుపు షాక్, స్మాల్ సేవింగ్స్ పథకాలపై తగ్గిన వడ్డీ రేట్లు

|

ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్ సహా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను తగ్గించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను ఈ వడ్డీ రేట్లను 1.1 శాతంమేర తగ్గించారు. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆర్థిక రికవరీ కోసం ఆర్బీఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గించడం ప్రభావం చూపింది. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రభుత్వం కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గించింది.

పాన్-ఆధార్ లింక్ చేసుకోలేదా, ప్రభుత్వం భారీ ఊరట: గడువు జూన్ 30 వరకు పొడిగింపుపాన్-ఆధార్ లింక్ చేసుకోలేదా, ప్రభుత్వం భారీ ఊరట: గడువు జూన్ 30 వరకు పొడిగింపు

ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) పైన వడ్డీ రేటును 0.7 శాతం తగ్గించి 6.4 శాతానికి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) పైన వడ్డీ రేటును 0.9 శాతం తగ్గించడంతో 5.9 శాతంగా ఉంటుంది. స్మాల్ సేవింగ్స్ స్కీం పైన వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఓసారి సవరిస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. సేవింగ్స్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు మొదటిసారి 0.5 శాతం తగ్గి 3.5 శాతంగా ఉన్నాయి. క్రితంసారి ఈ వడ్డీ రేట్లు 4 శాతంగా ఉన్నాయి.

సుకన్య సమృద్ధి యోజన సహా..

సుకన్య సమృద్ధి యోజన సహా..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) వడ్డీ రేటు 7.1 శాతం నుండి 6.4 శాతానికి తగ్గింది. గత 46 ఏళ్లలో ఇదే కనిష్ఠం. ఈ రేటు 7 శాతం కంటే తక్కువకు దిగజారడం 1974 తర్వాత ఇదే తొలిసారి. అలాగే సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేటు 7.6 శాతం నుండి 6.9 శాతానికి తగ్గింది. వివిధ కాలపరిమితులతో కూడిన పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు 0.40 శాతం నుండి 1.1 శాతం మేరకు తగ్గాయి. దీంతో ఈ డిపాజిట్లకు లభించే వడ్డీ 4.4 శాతం నుండి 5.3 శాతానికి పరిమితం కానుంది.

ఇది రెండోసారి

ఇది రెండోసారి

స్మాల్ సేవింగ్స్ పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లు కుదించడం గత ఏడాదిలో ఇది రెండోసారి. 2020-21 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను 70 నుండి 140 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. తాజా కుదింపుతో చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 110 నుండి 250 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గినట్లయింది.

English summary

పొదుపు షాక్, స్మాల్ సేవింగ్స్ పథకాలపై తగ్గిన వడ్డీ రేట్లు | Government cuts interest rates on small savings schemes effective from April 1

The government on Wednesday cut interest rates on small savings schemes, including NSC and PPF, by up to 1.1 per cent for the first quarter of 2021-22 in line with falling fixed deposit rates of banks.
Story first published: Thursday, April 1, 2021, 8:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X