Withdraw rules: నగదు విత్‌డ్రాలనూ వదలని కేంద్రం.. పన్ను బాదుడికి దండం పెడుతున్న సామాన్యుడు

Banking News: రోజులు మారుతున్న కొద్దీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో సామాన్యుడికి చిర్రెత్తుకొస్తోంది. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ములో తమ వద్ద ఎంత ఉంచుకోవాలి, బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలనే విషయాలను సైతం ప్రభుత్వమే నిర్ణయిస్తుండటంతో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ తరహా రూల్స్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా సర్కారు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

అప్పట్లో కేవలం సంపాదనపై మాత్రమే పన్నులు వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసిన కష్టార్జితాన్ని ఉపసంహరించేందుకు కూడా టాక్స్ కలెక్ట్ చేస్తోంది. గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్లు విత్‌డ్రా చేస్తాను అంటే కుదని పరిస్థితి ఏర్పడింది. ఇవి తెలుసుకోకపోతే సదరు అమౌంట్ పన్ను పరిధిలోకి వెళ్తుంది అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ATM లావాదేలకే కాకుండా బ్యాంకు నుంచి బయటకు తీసే నగదు పైనా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

Government curbs on bank withdraw transactions

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194N ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ఓ వ్యక్తి 20 లక్షలు మాత్రమే బ్యాంకు నుంచి విత్ డ్రా చేయవచ్చు. దానికి మించితే సదరు వ్యక్తి TDS చెల్లించాల్సిందే. వరుసగా మూడేళ్ల పాటు ITR రిటర్న్స్‌ ఫైల్ చేయని వారికి ఈ నియమం వర్తిస్తుంది. ఇతరులకు దీంతో ఇబ్బంది లేదు. అయితే ITR ఫైల్ చేసేవారు కోటి వరకు నగదు ఉపసంహరణ సౌలభ్యం పొందుతారని గమనించాలి.

ఉచిత పరిమితికి మించిన ATM లావాదేవీలపై ఆయా బ్యాంకులు ఇప్పటికే రుసుములు వసూలు చేస్తున్నాయి. లిమిట్ దాటిన అనంతరం జరిపే ప్రతి ట్రాన్సాక్షన్ పై 20 రూపాయలు వడ్డించుకోవలసి వస్తుంది. కాగా బ్యాంకు నుంచి విత్‌డ్రా పరిధి కూడా కోటి దాటితే 2 శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది. ఇక ITR ఫైల్ చేయని వారి విషయానికి వస్తే 20 లక్షల కంటే ఎక్కువ ఉపసంహరిస్తే 2 శాతం, కోటి దాటితే ఏకంగా 5 శాతం TDS పే చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+