For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెల్కోల కోసం స్ట్రెస్ ఫండ్: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఊరట?

|

AGR బకాయిలపై సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగానికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలపై దృష్టి సారించింది. ఈ అంసంపై కేంద్ర టెలికం శాఖ, ఇతర శాఖల సీనియర్ అధికారులు ఆదివారం భేటీ అయ్యారు. టెలికం పరిశ్రమకు తోడ్పాటు అవకాశాలను పరిశీలించారని తెలుస్తోంది. టెలికం విభాగంలో జరిగిన ఈ సమావేశం గంటకు పైగా సాగింది.

వారంలోనే రూ.1,800 ... భారీగా పెరిగిన బంగారం ధర: హైదరాబాద్‌లో ఎంతంటే?వారంలోనే రూ.1,800 ... భారీగా పెరిగిన బంగారం ధర: హైదరాబాద్‌లో ఎంతంటే?

టెలికం రంగం గతంలో ఎన్నడూలేని విధంగా తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమను గట్టెక్కించేందుకు పన్నులు, లెవీలను తగ్గించాలని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్‌ మిట్టల్ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వొడాఫోన్ ఐడియా కూడా ప్రభుత్వం వైపు చూస్తోంది. ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థికశాఖ అధికారులు హాజరయ్యారని సమాచారం.

Government considering stress fund for distressed telcos

ఈ భేటీలో చర్చించిన అంశంలపై మాట్లాడలేదు. కేంద్రానికి టెలికం సంస్థలు రూ.1.47 లక్షల కోట్లు బకాయి ఉన్న విషయం తెలిసిందే. ఈ బకాయిల్లో లైసెన్స్ ఫీజుల కింద రూ.92,642 కోట్లు, స్పెక్ట్రం వినిమయ ఛార్జీ కింద రూ.55,054 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, ఎయిర్‌టెల్ బకాయిలే దాదాపు 60% ఉన్నాయి.

AGR బకాయిలను చెల్లించాలని సుప్రీం కోర్టు ఇప్పటికే టెలికం సంస్థలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై కేంద్రం సమతుల్యత పాటిస్తూనే టెలికం రంగాన్ని గట్టెక్కించే అంశంపై దృష్టి సారించింది. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడుతూ సుప్రీం ఆదేశానికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. టెల్కోలకు స్ట్రెస్ ఫండ్‌ను పరిశీలిస్తోంది.

ఇదిలా ఉండగా, త్రీ ప్లస్ వన్ (మూడు ప్రయివేటు రంగ సంస్థలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ) విధానాన్ని అనుసరిస్తూ టెలికం రంగంలో పోటీని కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ప్రభుత్వానికి దాదాపు రూ.35 వేల కోట్ల AGR బకాయిలు చెల్లించాల్సిన ఎయిర్‌టెల్ ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు చెల్లించింది. మిగిలిన బకాయిలను మార్చి 17 లోగా చెల్లిస్తామని తెలిపింది. ఎయిర్‌టెల్ వివిధ మార్గాల ద్వారా 300 కోట్ల డాలర్లు సమీకరించింది. AGR బకాయిల సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశముంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిల్లో ఇప్పటి వరకు కేవలం 7% అంటే రూ.3,500 కోట్లు మాత్రమే చెల్లించిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ పీకల్లోతు కష్టాల్లో ఉంది.

English summary

టెల్కోల కోసం స్ట్రెస్ ఫండ్: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఊరట? | Government considering stress fund for distressed telcos

Telecom department officials remained tightlipped after high-level government meeting on Sunday, where officials from NITI Aayog and Finance Ministry are said to have been present.
Story first published: Monday, February 24, 2020, 15:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X