ఆగస్ట్ నెలలో జీఎస్టీ కలెక్షన్స్ రూ.1 లక్ష కోట్లు దాటాయి. జూలై నెల కంటే కలెక్షన్స్ తక్కువగా ఉన్నప్పటికీ వరుసగా రెండో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందనడానికి ఈ కలెక్షన్స్ పెరగడం నిదర్శనంగా చెబుతున్నారు. జూలై నెల నుండి రూ.50 వేల కంటే ఎక్కువ వ్యాల్యూ కలిగిన అంతర్రాష్ట్ర రవాణా పెరగడంతో ఈ-వే బిల్లులలో పెరుగుదల కనిపించింది. ఆగస్ట్ నెలలో కూడా ఇవి స్థిరంగా (అంటే ఈ పెరుగుదల) కనిపించింది. దీంతో జీఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి.
జూలై నెలలో ఈ-వే బిల్లులు రూ.6.41 కోట్లుగా ఉంది. జూన్ నెలలో ఇది రూ.5.46 కోట్లు, మే నెలలో రూ.4 కోట్లుగా ఉంది. ఈ-వే బిల్లు జనరేషన్ ఆగస్ట్ నెలలో రూ.6.33 కోట్లుగా నమోదయింది. డైలీ యావరేజ్ ఈ-వే బిల్లులు జూలై కంటే రెండు శాతం అధికంగా 21.1 లక్షలుగా నమోదయ్యాయి. ఏప్రిల్-మే నెలలో విద్యుత్ ఉత్పత్తి, ఇంధన వినియోగం, రైల్వే సరకు వంటి నిర్దిష్ట ప్రీక్వెన్సీ సూచికలకు సంబంధించిన డేటా కరోనా సెకండ్ వేవ్ నుండి వేగంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం జీఎస్టీ కలెక్షన్స్ వరుసగా తొమ్మిది నెలల పాటు రూ.1 లక్ష కోట్లు దాటాయి. జూన్ నెలలో రూ.1 లక్ష కోట్ల దిగువకు పడిపోయింది. జూలై నుండి మళ్లీ ఈ మార్కు దాటింది.

జీఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
జీఎస్టీ కలెక్షన్స్ మరోసారి రూ.1 లక్ష కోట్లు దాటాయి. ఆగస్ట్ నెలలో జీఎస్టీ కలెక్షన్స్ రూ.1.16 లక్షల కోట్లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఆదాయం ఏకంగా 30 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా గత ఏడాది రెవెన్యూ కలెక్షన్స్ భారీగా తగ్గాయి. ఇందులో సీజీఎస్టీ కలెక్షన్స్ రూ.20,522 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఐజీఎస్టీ రూ.56,247 కోట్లు నమోదయింది. ఇందులో రూ.26,884 కోట్లు గూడ్స్ ఇంపోర్ట్ ద్వారా వచ్చినవి. సెస్ రూ.8646 కోట్లు. ఇందులో గూడ్స్ దిగుమతుల ద్వారా రూ.646 కోట్లు వచ్చాయి. జీఎస్టీ కలెక్షన్స్ వరుసగా రెండో నెల రూ.1 లక్ష కోట్లు దాటింది.
గ్రాస్ జీఎస్టీ రెవెన్యూ ఆగస్ట్ నెలకు గాను రూ.1,12,020 కోట్లు వసూలయ్యాయని ఆర్థికమంత్రి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఆగస్ట్ నెలతో పోలిస్తే కలెక్షన్స్ 30 శాతం పెరిగినప్పటికీ, ఈ ఏడాది జూలై నెలతో పోలిస్తే మాత్రం తగ్గాయి. జూలైలో రూ.1.16 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. 2020 ఆగస్ట్ జీఎస్టీ కలెక్షన్స్ రూ.86,449 కోట్లుగా ఉంది. గత ఏడాదిన్నరగా 2020 మే నెలలో జీఎస్టీ కలెక్షన్స్ భారీగా తగ్గాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గరిష్ఠ స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లను నమోదయ్యాయి. రూ.1.40 లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు ఆ నెలలో నమోదు అయ్యాయి. ఇది రికార్డ్. దేశంలో జీఎస్టీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన అనంతరం తొలిసారిగా ఈ మార్కును చేరుకున్నాయి. అప్పుడే కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. మే నెలలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఫలితంగా మే నెలలో 1,02,709 కోట్ల రూపాయలుగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జూన్‌లో ఆ సంఖ్య మరింత ఘోరంగా పడిపోయింది. ఆ నెలలో నమోదయిన జీఎస్టీ వసూళ్లు రూ.92,849 కోట్లు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. జూలై నెలలో రూ.1.16 లక్ష కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఆగస్ట్‌లో అదే దూకుడు కనిపించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications