Banking News: రూ.2,331 కోట్లు కొచ్చేసిన ప్రభుత్వ బ్యాంకులు..! ఈ తప్పు చేయకండి

Minimum Balance Charges: ప్రస్తుతం దేశంలో వేగంగా డిజిటలైజేషన్ జరుగుతుందని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ వ్యవస్థను రోజువారీ చెల్లింపులకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చేస్తున్న చిన్న పొరపాటుతో ఖాతాదారులు ఏకంగా వేల కోట్లు నష్టపోతున్నట్లు వెల్లడైంది.

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.2,331 కోట్లను పెనాల్టీల రూపంలో సొమ్ము చేసుకున్నాయి. వాస్తవానికి లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఈ బ్యాంకులు గత మూడేళ్లలో కనీస బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుంచి రూ.5,614 కోట్లను వసూలు చేసినట్లు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరంలో 11 ప్రభుత్వ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలకు నుంచి 25 శాతం ఎక్కువ జరిమానా విధించాయి.

Government banks collected 2 331 crores in FY 2023-24 for not maintaining minimum balance

అయితే దీని నుంచి కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు మాత్రమే తప్పించుకున్నారు. ఎందుకంటే 2020 ఆర్థిక సంవత్సరంలోనే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు జరిమానా విధించే నిబంధనలను SBI తొలగించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ మినహా మిగిలిన 11 బ్యాంకులు ఖాతాదారుల నుంచి కనీస బ్యాలెన్స్ లేని పేరుతో భారీగా రూ.2,331 కోట్లను వసూలు చేశాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రూ.1,855.43 కోట్ల కంటే 25.63 శాతం అధికం కావటం గమనార్హం.

దీని ద్వారా గట్టిగా సొమ్ము చేసుకున్న ప్రభుత్వ బ్యాంకుల్లో తొలి స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. పీఎన్బీ గరిష్ఠంగా రూ.633.4 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఇక రెండో స్థానంలో నిలిచిన బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లను రికవర్ చేయగా, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్ల మొత్తాన్ని రికవరీతో మూడో స్థానంలో కొనసాగింది.

బ్యాంకుల వారీగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మెుత్తం వివరాలను పరిశీలిస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.386.51 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా* రూ.194.48 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.126.95 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.284.24 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.128.17 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369.16 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.4.58 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ.39.44 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.633.4 కోట్లు, UCO బ్యాంక్ రూ.37.49 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.126.66 కోట్లు వసూలు చేశాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+