Banks Open Today: ఆదివారం అయినా ఈ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయి..!
సెలవు రోజు అయినా ఈ ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు బ్యాంకులు తెరవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ఈ రోజు బ్యాంకులు అన్ని ఓపెన్ అయి ఉంటాయి. బ్యాంకు పనులు ఉన్న ఎవరైనా ఈ రోజు వారి పనులు పూర్తి చేసుకోవాలని పలు బ్యాంకులు సూచించాయి. వారానికి ఐదు రోజుల పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 వరకు సమ్మె చేయనున్నారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు బ్యాంకులు తెరిచి ఉంచనున్నారు.
ఇందుకు సంబంధించి ఆర్బీఐ కూడా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివేసే అవకాశం ఉన్న క్రమంలో వినియోగదారులు ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు ఆదివారం తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. నిన్న నాల్గో శనివారం కావడంతో బ్యాంకులు క్లోజు చేశారు. ఈ రోజు ఆదివారం కూడా బ్యాంకులు మూసి వేస్తే వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడి ఉండేవి. అయితే బ్యాంకు పనులు ఉన్నవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ రోజులు బ్యాంకులు తెరిచి ఉంచనున్నారు. ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని ఆర్బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, భారతీయ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. అంతే కాదు ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు మెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా కూడా సమాచారం అందించాయి. ఈ కార్యాలయాలతో పాటు ఏటీఎం అనుసంధానిత శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు, ఇతర బ్యాంకింగ్ సదుపాయాలు ఈ రోజు పని చేయనున్నాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజు క్లోజు చేసే ఉంటాయి. ఇందులో హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తో పాటు అన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజు మూతపడి ఉంటాయి. సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ తెరిచి ఉండనున్నాయి. కాగా ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్న మూడ రోజులు ఏటీఎంలు, ఇంటర్నెట్, మొబైల్, యూపీఐ బ్యాంకింగ్ వంటి సేవలు యథావిధిగా పని చేయనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
