Postal Insurance: పోస్టల్ ఇన్సూరెన్స్ కొనుగోలుదార్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి..
Bonus News: గ్రామాల నుంచి పట్టణాల వరకు వివిధ రకాల సేవలు అందిచడంలో పోస్ట్ ఆఫీస్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందించే వివధ పథకాలను చిట్టచివరి గ్రామాల వరకు తీసుకెళ్లే సత్తా వీటి సొంతం. అందుకే ఇప్పటికీ పెద్ద మొత్తంలో ప్రజలు వీటిలో ఇన్వెస్ట్ చేస్తూనే బీమా పాలసీలను సైతం కొనుగోలు చేస్తున్నారు.
పోస్ట్ ఆఫీసులో జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బోనస్ ప్రకటించింది. రూరల్ పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్సె ఫండ్ ఆస్తులు, అప్పుల ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆయా పథకాలపై అనౌన్స్ చేసిన కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

పలు రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్‌పై బోనస్ భిన్నంగా ఉంటుంది. అత్యధికంగా హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీపై వెయ్యి రూపాయలకు 60 బోనస్ లభించనుంది. పిల్లల పాలసీలు సహా ఎండోమెంట్ అస్యూరెన్స్‌కి 48, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ మరియు గ్రామ ప్రియా పాలసీలకు 45 చొప్పున వస్తుంది. ప్రతి 10వేల అష్యూర్డ్ మొత్తానికి 20, ఇరవై ఏళ్లు దాటిన హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ఎండోమెంట్ పాలసీలకు గరిష్ఠంగా వెయ్య బోనస్ రానుంది.
కేంద్రం గ్యారెంటీతో కూడిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను మొదట కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తింప చేశారు. అనంతరం బ్యాంకులు సహా ఇతర వృత్తులకు సంబంధించిన సిబ్బందికి కూడా అవకాశం కల్పించారు. కాగా 1894లో మొదలైన ఈ సేవలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications