Bank of Baroda: లాభాలతో ఇన్వెస్టర్ల మతిపోగొట్టిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంతంటే..??
Q1 Results: ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ సంస్థలు ఇటీవల మంచి పనితీరును కనబరుస్తున్నాయి. బ్యాంకుల మెర్జర్ తర్వాత వాటి లాభాలు భారీగా పెరిగాయి. అలాగే పనితీరు సైతం మెరుగుపడింది.
తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ రుణదాత కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన పనితీరును కనబరిచింది. బ్యాంక్ నికర లాభం 88 శాతం పెరిగి రూ.4,070 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. మంచి ఆరోగ్యకరమైన వడ్డీ ఆదాయం మెరుగైన పనితీరుకు కారణంగా కంపెనీ వెల్లడించింది. కిందటి ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం కేవలం రూ.2,168 కోట్లుగా ఉంది.

బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం Q1FY23లో రూ.8,838 కోట్ల నుంచి Q1FY24లో 24% పెరిగి రూ.10,997 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. వడ్డీయేతర ఆదాయంలో బలమైన వృద్ధి 2.8 రెట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో స్థూల ఎన్పీఏల నిష్పత్తి మునుపటి త్రైమాసికంలోని 3.79% నుంచి 3.51%కి మెరుగుపడింది. అలాగే నికర NPA నిష్పత్తి మునుపటి త్రైమాసికంలోని 0.89% నుంచి 0.78%కి చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్‌లలో(NIM) ట్రాక్షన్‌తో పాటు అడ్వాన్స్‌ల్లో 18% వృద్ధితో స్థిరమైన వృద్ధిని కనబరిచింది.
ఇదే క్రమంలో బ్యాంక్ డిపాజిట్ల వ్యయం 3.46% నుంచి 4.68%కి పెరగగా.. ఆదాయ నిష్పత్తి 54.81% నుంచి 45.36%కి తగ్గింది. GNPA 33.8% తగ్గి రూ.34,832 కోట్లకు చేరుకుంది. ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 93.23 వద్ద ఉంది. స్లిప్‌పేజ్ నిష్పత్తి ఏడాది క్రితం 1.71% నుంచి 1.05%కి తగ్గింది.


Click it and Unblock the Notifications