IDBI Bank Q1 Results: దేశంలోని బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. గడచిన దశాబ్ధకాలంలో ఎన్నడూ చూడని రీతిలో మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని IDBI బ్యాంక్ మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపధికన బ్యాంక్ నికర లాభం 62 శాతం పెరిగి రూ.1,224 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం కేవలం రూ.756 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(NII) 61% పెరిగి రూ.3,998 కోట్లకు చేరుకుంది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిర్వహణ లాభం గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,051 కోట్లతో పోలిస్తే 47% పెరిగి రూ.3,019 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో కేటాయింపులు ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరిగి రూ.1,190 కోట్లకు చేరుకున్నాయి. అలాగే నిరర్థక ఆస్తులకు కేటాయింపులు రూ.581 కోట్లుగా ఉన్నాయి. రిపోర్టింగ్ త్రైమాసికంలో నికర NPAలు 0.44%కి తగ్గాయి.
ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఏడాది క్రితం 97.78% నుంచి జూన్ 2023 నాటికి 98.99%కి మెరుగుపడింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ గత ఏడాది ఇదే కాలంలోని 4.02%తో పోలిస్తే.. 178 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 5.8%కి చేరుకుంది. నికర అడ్వాన్సులు 20% జంప్ చేసి రూ.1.65 లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్యూ1లో డిపాజిట్ వ్యయం 4.12%గా, నిధుల వ్యయం 4.40%గా ఉంది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో ఐడిబిఐ బ్యాంక్ షేర్లు రూ.57.90 వద్ద ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications