Q4 Results: 52% పెరిగిన డిఫెన్స్ కంపెనీ లాభాలు.. షేర్ తాజా టార్గెట్ ధర ఎంతంటే..?
HAL Q4 Results: దేశంలోని కార్పొరేట్ కంపెనీలు వరుసగా ప్రస్తుతం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ప్రభుత్వ యాజమాన్యంలోని డిఫెన్స్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బలమైన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని లీడింగ్ సంస్థ హెచ్ఏఎల్ జనవరి-మార్చి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 52 శాతం పెరిగి రూ.4,308 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో కంపెనీ వ్యాపార ఆదాయం 18 శాతం పెరిగి మార్చి త్రైమాసికంలో రూ.14,768.70 కోట్లుగా నమోదైంది. ఇది గడచిన ఏడాది ఇదే సమయంలో కేవలం రూ.12,494 కోట్లుగా ఉంది. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో ఏకంగా 10.89 శాతం లాభపడి రూ.4,637.90కి చేరుకుంది. ఇంట్రాడేలో నేడు స్టాక్ ధర రూ.6,656.40 గరిష్ఠ స్థాయిని అందుకుంది.

ప్రస్తుతం డిఫెన్స్ కంపెనీ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ బస్, బోయింగ్ లను కస్టమర్లుగా కలిగి ఉంది. ఇదే క్రమంలో కంపెనీ లాభాల మార్జిన మార్చి త్రైమాసికంలో 35 శాతానికి పెరిగింది. మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని డిఫెన్స్ మేజర్ ఖర్చులు ఏడాది క్రితం రూ.10,360 కోట్ల నుంచి రూ.9,543 కోట్లకు తగ్గాయి. కంపెనీ జనవరి-మార్చి కాలంలో రూ.5,470 కోట్ల EBITDAని నివేదించింది. వాస్తవానికి ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60 శాతం అధికంగా ఉంది.
మార్చి 2024తో ముగిసిన పూర్తి సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 31 శాతం పెరిగి రూ.7,621 కోట్లుగా నమోదైంది. అలాగే ఏడాది కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 13 శాతం పెరిగి రూ.30,381 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో మార్చి త్రైమాసికంలో, ప్రభుత్వం HALలో ఆఫర్ ఫర్ సేల్‌తో ముందుకు వచ్చింది. ఇది కఠినమైన మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ విజయవంతంగా సాగింది. యెస్ బ్యాంక్ సెక్యూరిటీస్ ప్రకారం ఒక్కో షేరుకు టార్గెట్ ధరను రూ.4,750గా ఉంది. ఇదే క్రమంలో రూ.3,670 ధరను స్టాప్ లాస్ కింద పరిగణించాలని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ లక్ష్మీకాంత్ శుక్లా తెలిపారు. ఇదే క్రమంలో షేర్లను రూ.4,000-4,050 స్థాయిల వద్ద కొనుగోలుకు ప్రయత్నించొచ్చని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications