Rent-Free Accommodation: ఆదాయపు పన్ను, మినహాయింపులకు సంబంధించిన అనేక విషయాలపై ఎల్లప్పుడూ గందరగోళం కొనసాగుతూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో నోటీసులు పొందిన వ్యక్తులు వాటిని చాలెంజ్ చేస్తూ కోర్టులకు వెళుతుంటారని మనందరికీ తెలిసిందే. తాజాగా హౌస్ రెంట్ అలవెన్స్ విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి అయిన తన తండ్రికి కేటాయించిన అద్దె రహిత వసతి గృహంలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి అద్దె అలవెన్స్(HRA) క్లెయిమ్ చేసే అర్హత లేదని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు BR గవాయ్, సందీప్ మెహతా ధర్మాసనం అప్పీలుదారుపై HRA రికవరీ నోటీసును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. వాస్తవానికి జమ్మూ అండ్ కాశ్మీర్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1992 ప్రకారం పదవీ విరమణ చేసిన వారు HRA క్లెయిమ్ చేయలేరు. అందువల్ల హెచ్‌ఆర్‌ఏగా గతంలో క్లెయిమ్ చేసిన రూ.3,96,814/- చెల్లించాలని అప్పీలుదారుకు రికవరీ నోటీసు జారీ చేయటాన్ని కోర్టు సమర్థించింది.

వాస్తవానికి 30 ఏప్రిల్ 2014న సేవల నుంచి పదవీ విరమణ పొందిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, 4వ బెటాలియన్‌లో ఇన్‌స్పెక్టర్ (టెలికాం)గా పనిచేసిన అప్పీలుదారుకు సంబంధించిన కేసు ఇది. అతను బకాయి ఉన్న ఇంటి అద్దె అలవెన్స్ (HRA) రికవరీకి సంబంధించిన కమ్యూనికేషన్‌ను అందుకున్నాడు. అప్పీలుదారు ప్రభుత్వ వసతిని పొందుతూనే అదే సమయంలో హెచ్‌ఆర్‌ఏ డ్రా చేస్తున్నాడని ఫిర్యాదుపై రికవరీ నోటీసు జారీ చేయబడింది. అర్హత లేకుండా హెచ్‌ఆర్‌ఏగా డ్రా చేసినట్లు నిర్ధారించిన టాక్స్ అధికారులు రూ.3,96,814/- మొత్తాన్ని డిపాజిట్ చేయాలని నోటీసులిచ్చారు. సంబంధిత ఇల్లు తన ఆధీనంలో లేదని నిర్ధారించడంలో అప్పీలుదారు విఫలమవడంతో రికవరీ నోటీసు జారీ చేయబడింది.
అప్పీలుదారు తరఫు న్యాయవాది శ్రీమతి పూర్ణిమ భట్ వాదిస్తూ.. సంబంధిత ఇంటిని రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన అప్పీలుదారు తండ్రికి కేటాయించారని, అప్పీలుదారు అప్పుడప్పుడు తన తండ్రితో ఇంటిని పంచుకునేవారని వాదించారు. 1992 రూల్స్‌లోని రూల్ 6(హెచ్)(iv)ని ఆమె బెంచ్ దృష్టిని తీసుకెళ్లారు. రూల్ 6(h)(iv) ప్రకారం ఒక కుటుంబంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది సభ్యులు పనిచేస్తున్నప్పుడు, వారు ప్రభుత్వం ఇచ్చే గృహాలలో కలిసి జీవిస్తున్నప్పుడు వారిలో ఒకరు మాత్రమే గృహ భత్యాన్ని పొందగలరని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర తరపు న్యాయవాది మిస్టర్ పార్త్ అవస్తి వాదిస్తూ, అప్పీలుదారు తన తండ్రికి కేటాయించిన ఇంటి నివాసాన్ని ఆస్వాదిస్తున్నందున 6(h)(i) & (ii) నిబంధనలు ప్రస్తుత కేసుకు వర్తిస్తాయన్నారు. దీంతో అప్పీలుదారు వాదనలను తరిస్కరించిన ధర్మాసనం బకాయి మెుత్తాన్ని తిరిగి చెల్లించాలని వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications