For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

YouTube: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇక డబ్బుల వర్షం.. ఎందుకంటే..

|

YouTube: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావటంతో ప్రతి ఒక్కరూ తమలో ఉన్న యాక్టింగ్ ప్రతిభను సామాజిక మాధ్యమాల్లోకి తెస్తున్నారు. దీనికి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో పాటు ఇతర ఫాట్ ఫారమ్లు కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆదాయాన్ని సైతం అందిస్తున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ షార్ట్స్..

యూట్యూబ్ షార్ట్స్..

యూట్యూబ్ షార్ట్స్ రూపంలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నవారికి గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై కంపెనీ యాడ్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని కంటెంట్ క్రియేటర్లతో పంచుకోబోతున్నట్లు ప్రకటించింది. దీనిని 2023 నుంచి ప్రారంభంచనున్నట్లు స్పష్టం చేసింది. ఇతర దిగ్గజ కంపెనీలతో పోటీ ఉన్నందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

అర్హత ఏమిటి..?

అర్హత ఏమిటి..?

కంపెనీ ప్రకటించిన కొత్త పాలసీ ప్రకారం ఆదాయాన్ని పొందటానికి కంటెంట్ క్రియేటర్లు గత 90 రోజుల కాలంలో 1000 మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండటంతో పాటు తమ వీడియోలకు 10 మిలియన్ వ్యూవ్స్ కలిగి ఉండాలి. ఇంతకు ముందు దీని అర్హత రూల్స్ 1,000 పైగా సబ్‌స్క్రైబర్స్ తో పాటు 4000 గంటల వీడియో వ్యూవ్స్ ఉండాలి.

 లెంథీ వీడియోల విషయంలో..

లెంథీ వీడియోల విషయంలో..

గడచిన 15 ఏళ్లుగా కంపెనీ లెంథీ వీడియోలు చేస్తున్న కంటెంట్ క్రియేటర్లకు యాడ్ రెవెన్యూను పంచుకుంటోంది. ప్రత్యర్థ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ రెవెన్యూ షేరింగ్ జరగడం ఇదే మొదటిసారి అని యూట్యూప్ చీఫ్ ప్రొడక్ట్స్ ఆఫీసర్ నీల్ మోహన్ పేర్కొన్నారు. మారుతున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో వారికి గొప్ప మద్దతునిచ్చే ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

పెయిడ్ క్రియేటర్స్..

పెయిడ్ క్రియేటర్స్..

ప్రపంచవ్యాప్తంగా 50 బిలియన్ డాలర్లకు పైగా పెయిడ్ క్రియేటర్స్, ఆర్టిస్టులు, మీడియా కంపెనీలు ప్రస్తుతం యూట్యూబ్ దగ్గర ఉన్నట్లు నీల్ మోహన్ తెలిపారు. షార్ట్ వీడియోలు కేవలం ఒక్క నిమిషం లోపు ఉంటాయి కాబట్టి రెవెన్యూ షేరింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్ రీల్స్ పేరుతో ఉన్న షార్ట్ వీడియోల విషయంలో యాడ్ రెవెన్యూ షేరింగ్ 2022లో ఇదే నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్ సైతం ఇదే ఫాలో అవుతోంది.

Read more about: youtube shorts google business news
English summary

YouTube: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇక డబ్బుల వర్షం.. ఎందుకంటే.. | googles youtube descided to share add revenue with video creators for short videos

googles youtube descided to share add revenue with video creators for short videos
Story first published: Wednesday, September 21, 2022, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X