'గూగుల్ పే'లో మరోకొత్త పేమెంట్ వ్యవస్థ.. ATM కార్డు లేకపోయినా చెల్లింపులు చేసేయండిలా..
GooglePay: గత కొంతకాలంగా పేమెంట్స్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాంకుల వద్దకు వెళ్లే అవసరం లేకుండా అరచేతిలోనే NEFT, RTGS, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతున్నాం. అయితే మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీలకు అనుగుణంగా పలు ఇతర వ్యవస్థలూ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా గూగుల్ పే లో ప్రవేశపెట్టిన సౌకర్యం ఈ కోవలోకే వస్తుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగించి పేమెంట్స్ చేయడానికి ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను గూగుల్ పే తాజాగా ప్రవేశపెట్టింది. అంటే వినియోగదారులు ఇప్పుడు డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే గూగుల్ పే లో తమ UPI పిన్ సెటప్ చేయవచ్చు. ఆధార్ నంబర్ ద్వారా గూగుల్ పే UPIలో రిజిస్టర్ కావడానికి.. వినియోగదారులు UIDAIతో, బ్యాంకు ఖాతాతో జతకాబడిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

డెబిట్ కార్డ్ అవసరం లేని UPI సైన్-అప్ ప్రక్రియను ప్రవేశపెట్టినట్లు గూగుల్ పే ప్రకటించింది. వినియోగదారులను ధృవీకరించడం లక్ష్యంగా కొత్త ఆధార్ ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి యూజర్స్ తమ ఆధార్ నంబర్ మొదటి 6 అంకెలను అందించాలి. వీటిని ధ్రువీకరణ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా UIDAIకి పంపబడతాయి.
NPCI వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 22 బ్యాంకులు ఆధార్ ద్వారా వినియోగదారుల ప్రమాణీకరణకు మద్దతునిస్తున్నాయి. భవిష్యత్తులో ఇతరులు సైతం ఈ వ్యవస్థలో భాగం అవుతారని గూగుల్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే యూజర్ల ఆధార్ నంబర్లు NPCIతో మాత్రమే షేర్ చేస్తామని, తమ వద్ద ఉంచుకోబడవని హామీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications