Google case: ప్లే స్టోర్ విషయంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను టెక్ దిగ్గజం గూగుల్ కు.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) భారీ పెనాల్టీ విధించిన వార్త తెలిసిందే. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT)ని సైతం ఆశ్రయించింది. అయితే అక్కడా ఎదురుదెబ్బ తగలడంతో చివరకు సుప్రీం తలుపు తట్టింది. తాజాగా ఇప్పుడు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలును ఉపసంహరించుకుంది. NCLATలో CCI ఆర్డర్‌కు వ్యతిరేకంగా వాదనలు కొనసాగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
గూగుల్ ప్లే స్టోర్ లో యాప్స్ కొనుగోలు చేయడానికి బిల్లింగ్ కోసం యాప్ డెవలపర్‌లు.. ఏదైనా థర్డ్-పార్టీ బిల్లింగ్ లేదా పేమెంట్ ప్రాసెసింగ్ సేవలను ఉపయోగించకుండా టెక్ దిగ్గజం పరిమితం చేసింది. ఇందుకు సంబంధించి CCI నుంచి జరిమానాను ఎదుర్కొంది. యాప్స్ చెల్లింపుల కోసం గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ను తప్పనిసరి చేస్తూ, తన మరో సొంత అప్లికేషన్ యూట్యూబ్ కు మాత్రం ఈ నిబంధన విధించకపోవడంపై వివాదం చెలరేగింది.

గూగుల్ విధానాలు కొత్త ఆవిష్కరణలకు విఘాతం కలిగిస్తున్నట్లు CCI అభిప్రాయపడింది. ఈ తరహా పద్ధతుల వల్ల పేమెంట్ ప్రోసెసర్స్ తో పాటు యాప్ డెవలరప్ల సామర్థ్యానికి భంగం కలుగుతోందని తెలిపింది. వారు ప్లే స్టోర్ యాక్సెస్ చేయకుండా వివక్షాపూరిత పద్ధతులను అనుసరిస్తోందని పేర్కొంది. అందుకే 936 కోట్ల భారీ జరిమానా విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, NCLATకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది.
కేవలం యాప్ మార్కెట్ లో తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి, స్థానాన్ని కాపాడుకోవడం కోసం ఈ చర్యలకు పాల్పడినట్లు CCI గుర్తించింది. యాప్స్ కొనుగోళ్ల కోసం థర్డ్ పార్టీ బిల్లింగ్ సేవలను అనుమంతించాలని గూగుల్ ను ఆదేశించింది. ఈ విషయంలో ఎటువంటి వివక్ష చూపకూడదని స్ఫష్టం చేసింది. పోటీ వ్యతిరేక పద్ధతులకు స్వస్తి చెప్పాలని సూచించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications