Google: CCI దెబ్బకు దారికొచ్చిన గూగుల్.. ONDC నెట్‌వర్క్ వృద్ధికి భారీ తోడ్పాటు
Google: ఎట్టకేలకు టెక్ దిగ్గజం గూగుల్ దిగివచ్చింది. కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) ఇచ్చిన షాక్ కు దిమ్మ తిరిగినట్లయింది. దీంతో భారత ప్రభుత్వం మద్ధతిస్తున్న ఇంటర్‌ఆపరబుల్ కామర్స్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్ (ONDC) తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఓ సీనియర్ అధికారి ఈమేరకు వెల్లడించారు.
"భారతదేశంలో డిజిటల్ సెల్లర్స్ బలమైన నెట్‌వర్క్ వృద్ధికి తోడ్పటు అందించేందుకు ONDC కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నాము" అని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే తెలిపారు. దీనికితోడు తన ప్రధాన మౌలిక సదుపాయాల APIలను ONDC పార్టిసిపెంట్‌లకు అందుబాటులో ఉంచుతుంది.

కొనుగోలుదారులు, విక్రేత అనుభవాలను మెరుగుపరచడానికి నెట్‌వర్క్‌లోని డెవలపర్‌లకు ఉత్పాదక AIను సైతం అందిచబోతోంది. ONDCలోని స్టార్టప్‌లకు క్లౌడ్ క్రెడిట్‌కు గాను 25 వేల డాలర్లు మంజూరు చేయనుంది. ల్యాండ్‌మార్క్‌లు, ఏరియా పేర్లను ఉపయోగించి చిరునామాలు కనుక్కోవడం, కమ్యూనికేషన్ సులభతరం చేయడానికి గూగుల్ మాప్స్ ఏకీకరణ సైతం ప్రారంభించనుంది.
ONDC నెట్‌వర్క్ ద్వారా వచ్చే రెండేళ్లలో దేశంలో ఇ-కామర్స్ వ్యాప్తిని 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 900 మిలియన్ల కొనుగోలుదారులు మరియు 1.2 మిలియన్ల విక్రేతలను చేరుకోవడం లక్ష్యంగా నిర్ణయించింది. అదనంగా మరో 48 బిలియన్ డాలర్ల స్థూల వాణిజ్య విలువను సాధించాలని పట్టుదలతో ఉంది. దీనిని చేరుకునేందుకు గూగుల్ అందించనున్న ఈ అవకాశాలు మరింత బూస్ట్ ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications